ఓ ఈవెంట్ లో, అది కూడా అందరిముందు కోహ్లీని అనుష్క శర్మ ర్యాగింగ్ చేసింది. కోహ్లీ ఒక్కసారిగా షాకై తెగ నవ్వుకున్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే ఫ్యాన్స్ కి ఫస్ట్ గుర్తొచ్చేది అతడి రికార్డులు. నెక్స్ట్ గుర్తొచ్చేది అతడి గొడవలు, గ్రౌండ్ లో అతడి అగ్రెషన్. వికెట్ పడితే చాలు బౌలర్ కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఏదైనా తేడా వస్తే అవతల ఉన్నది ఎంత పెద్ద స్టార్ ప్లేయర్ అయినా అస్సలు తగ్గడు. రీసెంట్ గా ఐపీఎల్ లో లక్నోతో మ్యాచ్ లో గంభీర్ తో గొడవపడ్డాడు. అడ్డొచ్చిన నవీన్ ఉల్ హక్ కి గట్టిగానే ఇచ్చేశాడు. ఇప్పుడిప్పుడే ఈ విషయం అందరూ మర్చిపోతున్నారు. ఇలాంటి టైంలో కోహ్లీని అందరిముందు అతడి భార్య అనుష్క శర్మ ర్యాగింగ్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ లో ఆర్సీబీ ఈసారి ఓ మాదిరి ఫెర్ఫార్మెన్స్ చేసింది. మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకునే టైంలో కరెక్ట్ గా హ్యాండిచ్చేసింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ హడావుడిలో పడిపోయాడు. ఇప్పటికే లండన్ కూడా వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లడాని కంటే ముందు కోహ్లీ-అనుష్క కలిసి పుమా కంపెనీ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియో బిట్స్ బిట్స్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిగతా వాటి సంగతేమో గానీ ఒక్కటి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ వీడియోలో భాగంగా యాంకర్ గా ఉన్న వ్యక్తి, కోహ్లీ సెలబ్రేషన్స్ ని ఇమిటేట్ చేసి చూపించమని అనుష్కని అడిగారు. దీంతో అవతల జట్టు వికెట్ పడ్డప్పుడు కోహ్లీ ఎలా బిహేవ్ చేస్తాడనేది అనుష్క ఉన్నది ఉన్నట్లుగా చేసి చూపించింది. కోహ్లీ చూసి నవ్వుకున్నాడు. చెప్పాలంటే ఈ ఈవెంట్ లో అందరిముందే విరాట్ కోహ్లీని అనుష్క ర్యాగింగ్ చేసిందనే చెప్పాలి. ఇది చూడటానికి చాలా ఫన్నీగా ఉంటూనే మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది. సో అదనమాట విషయం. మరి ఈ వీడియో చూడగానే మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.
Anushka doing virats celebration#AnushkaSharma #ViratKohli𓃵 pic.twitter.com/3j4CSQ9jOX
— S🤍 (@nushstan) May 26, 2023