ఐపీఎల్ 2022లో భాగంగా 14వ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. కేకేఆర్ గత మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించగా, ఒక మ్యాచ్‌లో ఓడింది. కాగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని ఎంఐ భావిస్తుంది. మరి ఈ రెండు జట్లలో విజయం సాధించేది ఎవరో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలు పరిశీలిద్దాం..
ముంబై ఇండియన్స్..
కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, యువ సంచలనం తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్‌లతో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో భీకరంగా కనిపిస్తుంది. వీరిలో ఈ ఇద్దరు రాణించినా భారీ స్కోర్ ఖాయం. కానీ అసలు సమస్యల్లా బౌలింగ్. ముంబైలో నిఖార్సయిన స్పిన్నర్ లేకపోవడం అతిపెద్ద మైనస్. పేస్‌లో కూడా జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే భారం మొస్తున్నట్లు కనిపిస్తుంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బుమ్రా 3 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్‌లో వికెట్లేమీ దక్కలేదు. అలాగే థంపి కొంత పర్వాలేదనిపిస్తున్నాడు. మిల్స్, సామ్స్ ధారళంగా పరుగులు ఇస్తున్నారు. మొత్తానికి ముంబై పూర్తిగా బ్యాటింగ్‌పై ఆధరపడుతున్న జట్టు.
కోల్‌కత్తా నైట్ రైడర్స్..
కేకేఆర్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. ముంబైతో పోల్చుకుంటే కేకేఆర్ బౌలింగ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రహానే, వెంకటేశ్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, నితీష్ రాణా, రస్సెల్‌లతో భారీ టార్గెట్ అయినా ఛేదించేలా బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ కూడా ఆడే అవకాశం ఉంది. ఈ ఆల్‌రౌండర్ రాకతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలు మరింత బలపడనున్నాయి. స్పిన్‌లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఉండనే ఉన్నారు.
పిచ్..
ఈ మ్యాచ్ పుణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ పేస్ బౌలింగ్‌కు, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పిచ్‌లో బౌన్స్ దొరికితే ఇన్నింగ్స్ ప్రారంభంలో బ్యాటర్లకు కష్టాలు తప్పవు.
హెడ్ టూ హెడ్..
ఈ రెండు జట్ల మధ్య మొత్తం 29 మ్యాచ్‌లు జరగ్గా, అందులో ముంబై జట్టు 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు ఎనాలసిస్ చేసిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రెండు జట్ల మధ్య ప్రధాన తేడా.. బౌలింగ్. ఇందులో కేకేఆర్ పటిష్టంగా కనిపిస్తుంది. కేకేఆర్ బౌలర్లు వాళ్ల స్థాయికి తగ్గట్లు రాణిస్తే.. విజయం ఖాయం.
తుది జట్ల అంచనా..
ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్.
కోల్‌కతా నైట్ రైడర్స్.. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.
ఇదీ చదవండి: కావ్య పాప పరువు తీస్తున్న SRH ప్లేయర్లు! ఇందుకేనా మిమ్మల్ని కొన్నది..
Punekars, you’re in for a 𝙕𝙊𝙍𝘿𝘼𝘼𝙍 treat! 💥#KKRHaiTaiyaar #KKRvMI #IPL2022 pic.twitter.com/3ANW5RibzV
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.