తెలుగు కుర్రాడైన హనుమ విహారి.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కోనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన విషయం వాస్తవమే. అయితే,.. అలానే నిరాశతో ఉండకుండా.. బీసీసీఐ దగ్గర పర్మిషన్ తీసుకొని బంగ్లాదేశ్ వేదికగా హాజరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మెగా వేలంలో తనకు జరిగిన అవమానంపై గుర్రుగా ఉన్నఈ యువ క్రికెటర్ ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ లీగ్‌లో విహారి.. తన చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓ అజేయ సెంచరీ, హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
2010లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన విహారి.. వరుసగా రాణిస్తూ.. జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. నిలకడగా రాణిస్తున్నా.. స్ట్రైక్ రేట్.. టీ20 క్రికెట్ కు తగ్గట్టుగా లేకపోవడంతో.. టెస్టు క్రికెటర్ గా ముద్రపడ్డాడు. దీంతో బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో.. 50 లక్షల రూపాయల కనీస ధరకు అందుబాటులో ఉన్నా ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో చేసేదేమి లేక బీసీసీఐ పర్మిషన్ తీసుకుని బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు.
ఇది కూడా చదవండి: ఓటమితో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ!
టెస్టు స్పెషలిస్ట్ అని తనపై పడ్డ ముద్రను చెరిపేసుకోవాలనుకున్నాడో ఏమో కానీ, ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మాత్రం అచ్చమైన టీ20 క్రికెటర్‌లా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో సెంచరీలు, హాఫ్ సెంచరీలు సునాయసంగా బాదేస్తున్నాడు. చివరి మూడు మ్యాచ్‌ల్లో హనుమ విహారి వరుసగా .. 45 , 112* , 59 పరుగులు చేశాడు. అంటే,.. ఈ 3 ఇన్నింగ్స్‌ల్లో కలిపి విహారీ 216 పరుగులు చేశాడు. ఓ మ్యాచ్‌లో అజేయ సెంచరీతో విశ్వరూపం చూపించాడు.
Hanuma Vihari continues his grind 💪
The India batter is currently playing in the DPL in Bangladesh and has registered scores of 45, 112* and 59 in his last three innings!
His latest exploits 👉 https://t.co/GMQlMSlJgG pic.twitter.com/LouXwghy6x
— ESPNcricinfo (@ESPNcricinfo) April 7, 2022
అయితే.. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో హనుమ విహారి ఆట చూసిన అభిమానులు సన్‌రైజర్స్ టీంలోకి తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయడపడుతున్నారు. ఇప్పటికే.. ముంబై ఫ్రాంచైజీ సొంతం చేసుకున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మ విషయంలో.. సన్‌రైజర్స్ పై గుర్రుగా ఉన్న తెలుగు అభిమానులు.. విహారి ఇన్నింగ్స్ లు చూశాక గెలవడం ఇష్టంలేక ఇలా చేస్తున్నారంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాదైనా తెలుగు ఆటగాళ్లను సన్‌రైజర్స్ టీం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడిన హనుమ విహారీ 14 సగటుతో 284 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 46 పరుగులుగా ఉంది.
Hanuma Vihari’s maiden DPL ton leads Abahani to victory 💪🏻#আমিইআবাহনী 🏏 pic.twitter.com/QAX9cUfgKh
— Abahani Limited (@Abahani_Limited) April 2, 2022
ఇది కూడా చదవండి: తెలుగోడు తిలక్ వర్మ కొట్టిన సిక్స్‌కు కళ్లు తేలేసిన కమిన్స్