తెలుగు అభిమానులని అలరించడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రాండ్ గా నిర్వహించిన ఈ వేలంలో టీమిండియా తరపున ఆడిన హనుమ విహారీకి భారీ ధర దక్కింది.
ప్రస్తుతం సౌత్ జోన్ కి కెప్టెన్సీ చేస్తున్న విహారీ టీం ఫైనల్ కి దూసుకెళ్లింది. బుధవారం ప్రారంభమయ్యే ఫైనల్లో వెస్ట్ జోన్ తో తుది పోరుకి సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విహారీ ఆసక్తికర కామెంట్లు చేసాడు.
ఆంధ్ర క్రికెటర్ విహారీకి ప్రస్తుతం కష్ట కాలం నడుస్తుంది. టీంఇండియాలో వరుస అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దీని ప్రకారం ఆంధ్ర జట్టుని వీడి మధ్య ప్రదేశ్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడబోతున్నాడని తెలుస్తుంది.
ఏడాదిన్నర క్రితం అతనే టీమిండియాకు హీరో.. కానీ ఇప్పుడు కనీసం సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు బీసీసీఐ. ఒక్క సిరీస్‌కు అందుబాటులో లేకుంటే మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తారా? అంటూ బీసీసీఐపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
క్రికెట్‌లో కొంతమంది కొట్టే షాట్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. సచిన్ స్ట్రేట్ డ్రైవ్, కోహ్లీ కవర్ డ్రైవ్, ధోని హెలికాప్టర్ షాట్, యువరాజ్ సింగ్ ఫ్లిక్ షాట్, రోహిత్ శర్మ పుల్‌షాట్, సూర్యకుమార్ యాదవ్ స్విప్ షాట్.. ఇలా మన ఇండియన్ ప్లేయర్లలో దాదాపు ఒక్కొక్కరికి ఓ ప్రత్యేకమై షాట్ ఉంది. ఆ షాట్‌ను వారు తప్ప ప్రపంచంలో మరే ఆటగాడు కూడా అంత సొగసుగా ఆడలేడు. వాళ్లు ఆ షాట్లు ఆడుతుంటే.. ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అయితే.. […]
క్రికెట్‌లో ఒక చేతితో బ్యాటింగ్, మరో చేతితో బౌలింగ్ చేసే వాళ్లను చూసుంటాం. లెప్టాంటెడ్ బ్యాటర్ అయిన భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ.. కుడిచేతితో బౌలింగ్ చేస్తారనేది తెలిసిందే. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇలాగే కుడి చేతితో బౌలింగ్, ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తాడు. ఇక బ్యాటింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి కొందరు బ్యాట్స్‌మన్ కుడి చేతితో బ్యాటింగ్ చేసినా.. అవసరమైనప్పుడు ఎడమ చేతితో రివర్స్ స్వీప్‌లు కొడుతుంటారు. దీని వల్ల బౌలర్‌కు బంతిని […]
సర్ఫరాజ్ ఖాన్.. దేశవాళీ క్రికెట్ లో మార్మోగుతున్న పేరు ఇది. అంతర్జాతీయ క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ ఎంత ఈజీగా సిక్సర్లు కొడుతున్నాడో.. అంతే ఈజీగా సర్ఫరాజ్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్, ఇప్పుడు ఇరానీ కప్‌లోనూ అదే ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇరానీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచులో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో తొడగొట్టి మరీ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో […]
భారీ ఆశలతో ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత జట్టుకు భంగపాటు తప్పలేదు. టీమిండియా సారథి రోహిత్ శర్మ గైర్హాజరీలో ఇంగ్లాండుతో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టుకు మరో దారుణ ఓటమి ఎదురైంది. నాలుగో రోజు ఆటలో ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్‌స్టో ఇద్దరూ ఇదో రోజు సెంచరీలతో చెలరేగారు. ఆఖరి రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్, బెయిర్‌స్టో దంచి కొట్టారు. ఎడాపెడా బౌండరీలతో ఇద్దరూ చెలరేగడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. […]
తెలుగు టీవీ ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా దగ్గరైన VJ సన్నీ, శ్రీరామచంద్ర, జెస్సి, యాంకర్ రవి కలిసి ప్రొఫెషనల్ క్రికెటర్ హనుమ విహారి ఆధ్వర్యంలో టి20 క్రికెట్ ఆడారు. ఎంతో ఫన్నీగా సాగిన ఈ ఆటలో అందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ క్రమంలో వీరి ఆట చూడటానికి వచ్చిన క్రికెటర్ హనుమ విహారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఆటతీరును ప్రశంసించాడు. యాంకర్ రవి, శ్రీరామచంద్ర, సన్నీల డిస్కషన్ చాలా ఫన్నీగా సాగింది. […]
తెలుగు కుర్రాడైన హనుమ విహారి.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కోనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన విషయం వాస్తవమే. అయితే,.. అలానే నిరాశతో ఉండకుండా.. బీసీసీఐ దగ్గర పర్మిషన్ తీసుకొని బంగ్లాదేశ్ వేదికగా హాజరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మెగా వేలంలో తనకు జరిగిన అవమానంపై గుర్రుగా ఉన్నఈ యువ క్రికెటర్ ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ లీగ్‌లో విహారి.. తన చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓ అజేయ […]