తెలుగు అభిమానులని అలరించడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రాండ్ గా నిర్వహించిన ఈ వేలంలో టీమిండియా తరపున ఆడిన హనుమ విహారీకి భారీ ధర దక్కింది.
ప్రపంచంలో ఎన్నో క్రికెట్ దేశాలు లీగ్ లు ఆడుకున్నట్లే దేశంలో కూడా ప్రతి క్రికెట్ ఆడే ప్రధాన రాష్ట్రాలు సొంత లీగ్ ఆడుకుంటున్నాయి. ఇటీవలే తమిళనాడు ప్రీమియర్ లీగ్, మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ అభిమానులని అలరించగా.. తాజాగా తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వచ్చేస్తుంది. తాజాగా ఈ లీగ్ కి సంబంధించిన షెడ్యూల్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ నెల 16 నుంచి 27 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. గతేడాది తొలిసారి ఈ లీగ్ కి శ్రీకారం చుట్టగా రెండో సీజన్ లో అభిమానులని అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్ జట్లు ఉన్నాయి. ఈ ఆరు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
ఇక ఈ లీగ్ కి సంబంధించిన వేలం ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. గత కొంతకాలంగా టీమిండియాలో చోటు కోల్పోయిన విహారీ ఈ వేలంలో అత్యధిక ధర పలకడం విశేషం. రాయలసీమ కింగ్స్ ఫ్రాంచైజ్ అతన్ని రూ.6.6 లక్షల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇక ఈ లిస్టులో కేఎస్ భరత్ ని ఉత్తరాంధ్ర జట్టు, బెజవాడ టైగర్స్ టీమ్ రికీ భుయ్‌ని రిటేన్ చేసుకున్నాయి. విహారీ తర్వాత ధీరజ్ కుమార్ అత్యధికంగా 5.2 లక్షలు పలికాడు. యర్రా పృథ్వీ రాజ్, అశ్విన్ హెబ్బార్ ఇద్దరూ కూడా 5 లక్షల భారీ ధరకు అమ్ముడుపోయారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ తరహాలోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కూడా జరగనుంది. మ్యాచ్‌లన్నీ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరగనున్నాయి. కోస్టల్ రైడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈ మ్యాచులో బరిలోకి దిగుతుంది. మరి ఆంధ్రాలో జరగబోయే ఈ లీగ్ సీజన్ 2 అభిమానులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
ఏపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే..
ఆగస్టు 16, 5 PM, కోస్టల్ రైడర్స్ vs బెజవాడ టైగర్స్
ఆగస్టు 17, 10 AM, వైజాగ్ వారియర్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 17, 3 PM, రాయలసీమ కింగ్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 18, 12 PM, కోస్టల్ రైడర్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 18, 5 PM, బెజవాడ టైగర్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 19, 10 AM, బెజవాడ టైగర్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 19, 3 PM, ఉత్తరాంధ్ర లయన్స్ vs కోస్టల్ రైడర్స్
ఆగస్టు 20, 10 AM, ఉత్తరాంధ్ర లయన్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 20, 3 PM, గోదావరి టైటాన్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 21, 12 PM, బెజవాడ టైగర్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 21, 5 PM, రాయలసీమ కింగ్స్ vs వైజాగ్ వారియర్స్
ఆగస్టు 22, 12 PM, గోదావరి టైటాన్స్ vs కోస్టల్ రైడర్స్
ఆగస్టు 22, 5 PM, వైజాగ్ వారియర్స్ vs బెజవాడ టైగర్స్
ఆగస్టు 23, 12 PM, కోస్టల్ రైడర్స్ vs రాయలసీమ కింగ్స్
ఆగస్టు 23, 5 PM, ఉత్తరాంధ్ర లయన్స్ vs గోదావరి టైటాన్స్
ఆగస్టు 25, 12 PM, ఎలిమినేటర్
ఆగస్టు 25, 5 PM, క్వాలిఫైయర్ 1
ఆగస్టు 26, 5 PM, క్వాలిఫైయర్ 2
ఆగస్టు 27, 5 PM, ఫైనల్