ఐపీఎల్ 2022లో రాయల్ ఛాజెంజర్స్ బెంగుళూరు మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ ఫామ్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లడం ఖాయం. ప్రస్తుతం ఆర్సీబీ ఈ సూపర్ ఫామ్‌లో ఉందంటే దానికి ప్రధాన కారణం దినేష్ కార్తీక్. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్న డీకే ఈ ఏడాది మాత్రం సూపర్ డూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. చివరి ఓవర్లలో ఒత్తిడిని జయిస్తూ.. కళ్లుచెదిరే ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఆర్సీబీని గెలిపిస్తున్నాడు. మొత్తానికి ఆర్సీబీకి ఎప్పటి నుంచో లోటుగా ఉన్న ఫినిషర్ రోల్‌ను భర్తీ చేస్తూ.. ఆర్సీబీ ఇన్నేళ్లు ఏం మిస్ అయిందో చూపిస్తున్నాడు.
2004లోనే టీమిండియాలోకి వచ్చిన దినేష్ కార్తీక్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. ఆ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భారత్ క్రికెట్‌ను 2007 టీ20 వరల్డ్ కప్ నుంచి శాసించడం ప్రారంభించాడు. డీకే కూడా వికెట్ కీపర్ కమ్ మిడిల్డార్ బ్యాట్స్‌మెన్ కావడంతో ధోనితో ఉన్న పోటీ వల్ల అడపాదడప టీమిండియాలో కనిపించేవాడు. ధోని అనే వ్యక్తి లేకుంటే.. టీమిండియాలో రాహుల్ ద్రవిడ్ తర్వాత వికెట్ కీపర్‌గా డీకేనే ఉండేవాడు. చాలా సీనియర్ ప్లేయర్ అయిన తర్వాత ధోని తర్వాత యువ క్రికెటర్లు పంత్, సాహాలతో పోటీ పడ్డాడు. ఈ క్రమంలో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.. ఫినిషర్ బ్యాటర్‌గా తనని తాను మార్చుకున్నాడు. ఇప్పుడు డీకే బ్యాటింగ్ చూస్తే ఇక టాలెంటెడ్ యువ క్రికెటర్ బ్యాటింగ్ చూస్తున్నట్లే ఉంటుంది. అంతలా తన బ్యాటింగ్‌లో కొత్తదనం చూపిస్తున్నాడు. గ్రౌండ్‌కు అన్ని వైపులా 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడుతూ బౌలర్లుకు సవాలు విసురుతున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సులతో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌తో 7 బంతుల్లో 14 పరుగులు చేసి నాటౌట్‌గానే నిలిచాడు. మూడో మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 23 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. అలాగే చెన్నైతో జరిగిన మ్యాచ్లో 14 బంతుల్లో 34 పరుగలు చేశాడు. అందులో 2 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అయితే విశ్వరూపం చూపించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 66 పరుగులు చేశాడు. ముస్తఫిజుర్ రహెమాన్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 6, 6, 4 బాది అరాచకం చేశాడు. ఇలా ఐపీఎల్‌లో చివరి ఓవర్లలో భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నాడు. దీంతో అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం దినేష్ కార్తీక్‌ను టీమిండియాలోకి తీసుకునే అవకాశం మొండుగా ఉన్నట్లు తెలుస్తుంది. టీమిండియాకు కూడా ఫినిషర్ లోటు ఉంది. గతంలో ధోని టీమిండియాకు బెస్ట్ ఫినిషర్‌గా ఉండే వాడు.. ఇప్పుడు డీకే.. ధోని స్థానాన్ని భర్తీ చేసేలా ఉన్నాడు. వికెట్ కీపింగ్‌కు తోడు ఎంత ఒత్తిడి ఉన్నా.. చివర్లో విజయానికి కావాల్సిన పరుగులు చేయడంలో డీకే స్టైలే వేరు.
గతంలో బంగ్లదేశ్‌తో జరిగిన నిధాస్ ట్రోఫీ ఫైనల్‌లో డీకే సృష్టించిన విధ్వంసం అంత ఇంత కాదు.. బంగ్లా ఆటగాళ్లను ఏడిపించేశాడు. కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. పైగా చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టి టీమిండియాకు మరుపురాని విజయం అందించాడు. బంగ్లాదేశ్ కోరల్లో ఉన్న గెలుపును లాక్కుని.. వాళ్ల నాగిని డాన్స్‌కు సూపర్ బ్యాటింగ్ సమాధానం ఇచ్చాడు. ఆ గెలుపు నుంచి డీకే ఫినిషర్‌గా మారిపోయాడు. ఇప్పుడు ఐపీఎల్ 2022లో కూడా అలాంటి ఆటతీరునే కొనసాగిస్తున్నాడు. దీంతో టీమిండియాకు ధోని తర్వాత బెస్ట్ ఫినిషర్ లేని లోటును డీకేతో భర్తీ చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే 2019 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై చివరి టీ20 మ్యాచ్ ఆడిన డీకేను మళ్లీ టీమిండియా జెర్సీలో చూడొచ్చు. మరి డీకే ఫామ్‌పై, టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: CSKకే ఓటమికి కారణం ధోనినే! ఇదిగో సాక్ష్యం..
Dinesh Karthik in IPL 2022:
32* (14) Vs PBKS.
14* (7) Vs KKR.
44* (23) Vs RR.
7* (2) Vs MI.
34 (14) Vs CSK.
66* (34) Vs DC.– DK the MVP of RCB. Tonight he came in the 12th over and stabled the innings, later unleashed and gave a marvelous finish. pic.twitter.com/Xr2GWM9Gs2
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.