సౌతాఫ్రికా అండర్ 19 ప్లేయర్ డెవాల్ట్ బ్రెవిస్.. అందేనండీ బేబీ ఏబీడీ.. ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతులు ఆడిన బ్రెవిస్ 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే బ్రెవిస్ బాదిన ఓ సిక్స మాత్రం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ముంబై బ్యాటింగ్ సమయంలో వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో.. బంతిని చూడకుండానే బ్రెవిస్ భారీ సిక్స్ బాదాడు.
బ్యాక్వర్డ్ స్క్వైర్ లెగ్ పైనుంచి కొట్టిన సిక్స్ ప్రేక్షకులకు కనుల విందును అందించింది. కాగా అదే ఓవర్లో ఐదో బంతికి బ్రెవిస్ స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు. బ్రెవిస్ సిక్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అండర్-19 ప్రపంచకప్‌లో రాణించిన బ్రెవిస్‌ను ఐపీఎల్లో మెగా వేలంలో రూ. 3కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. మరి జూనియర్ డివిలియర్స్, బేబీ ఏబీడీగా పేరొందిన బ్రెవిస్ కొట్టిన సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఒకే ఓవర్లో 35 పరుగులు! విధ్వంసం సృష్టించిన కమిన్స్
Wow what a hit for six! Baby AB Dewald Brevis no look shot, I have no word. Reminds me of ABD again today. Treat to watch this exciting talent. #KKRvMI #KKRvsMI #Abdevilliers #IPL2022 #IPL pic.twitter.com/ytEnjH7q5b
— Mohit Pandey (@mohitherapy) April 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.