విధ్వంసకర ఆటకు మారుపేరుగా నిలిచిన క్రికెటర్ ఎవరంటే క్రికెట్ అభిమానులంతా ఠక్కున చెప్పే పేరు ఏబీ డివిలియర్స్. ఈ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌కు మిస్టర్ 360 ప్లేయర్ అనే బిరుదు ఉంది. ఎలాంటి బాల్ వేసినా.. క్రికెట్ టెక్ట్స్ బుక్స్‌లో లేని షాట్‌తో భారీ సిక్సులు బాదేయడం అతని స్టైల్. అలాంటి ఆటనే ఇటివల టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఆడుతూ.. మరో మిస్టర్ 360గా పేరుతెచ్చుకున్నాడు. అయితే.. డివిలియర్స్‌కు అసలైన వారసుడిగా ఆ దేశం నుంచే మరో యువ కెరటం క్రికెట్లోకి అడుగుపెట్టింది. సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడకముందే.. ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అతనే బేబీ ఏబీగా పిలువబడే డెవాల్డ్ బ్రెవిస్.
సౌతాఫ్రికాకు చెందిన ఈ కుర్రాడు.. టీ20 క్రికెట్ కోసమే పుట్టినట్లు ఆడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికా వేదికగా ప్రారంభమైన ‘ఎస్ఏ టీ20 లీగ్’లో తొలి మ్యాచ్‌లోనే దుమ్మురేపాడు. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 41 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో 70 పరుగుల సాధించాడు. సాధారణంగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి సునామీ ఇన్నింగ్స్ రెచ్చిపోయి ఆడే బ్రెవిస్.. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఓపెనర్ అవతారం ఎత్తాడు. మ్యాచ్ ఆరంభం నుంచి రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడుతూ.. ఫోర్లు, సిక్సులు తనదైన స్టైల్లో బాదేశాడు. డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్లానే బ్రెవిస్ కూడా ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. రాయల్స్ బ్యాటర్స్‌లో బట్లర్ 51, కెప్టెన్ మిల్లర్ 42 పరుగులతో రాణించారు. ఈ 143 పరుగుల టార్గెట్‌ను ఎంఐ కేప్‌టౌన్ జట్టు కేవలం 15.3 ఓవర్లలోనే ఊదిపారేసింది. ఓపెనర్ డెవాల్డ్ బ్రెవిస్ 70(నాటౌట్), మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 42 పరుగులతో అదరగొట్టారు. అలాగే సామ్ కరన్ 20 పరుగులు చేశాడు. డస్సెన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరి ఈ మ్యాచ్ డెవాల్డ్ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
There is a reason why Dewald Brevis is rated so highly. This is just a small glimpse#SA20pic.twitter.com/2LyffJ6V0N
— Werner (@Werries_) January 10, 2023