ఐపీఎల్ 2022 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటి మ్యాచులో ఓటమి పాలయిన.. ఆర్సీబీ తరువాత రెండు మ్యాచుల్లో పుంజుకున్న తీరు అమోఘం. మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సంచలన విజయం సాధించింది. దినేశ్ కార్తిక్ విధ్వంసకర బ్యాటింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్)కు తోడూ షాబాజ్ అహ్మద్(26 బంతుల్లో 45, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడ చూపించడంతో ఆర్‌సీబీ విజయం సాధించింది. అయితే.. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
100 విజయాలు.. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఆర్సీబీ సాధించిన విజయాలు. లీగ్ ప్రారంభమైన నాటి నుంచి ఆర్‌ఆర్‌తో మ్యాచ్ వరకు మొత్తం 214 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 100 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, 107 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితం రాకపోగా, 2 మ్యాచ్‌ల్లో టై బ్రేకర్‌లో గెలుపు, మరో మ్యాచ్‌లో టై బ్రేకర్‌లో ఓటమి చవిచూసింది. ఏ జట్టుకైనా 100 విజయాలు నమోదుచేయడమంటే గొప్ప విషయమే. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఈ మార్కును చేరుకున్న నాలుగవ జట్టుగా అవతరించింది. ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ (219 మ్యాచ్‌ల్లో 125 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (198 మ్యాచ్‌ల్లో 117 విజయాలు), మూడో ప్లేస్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (212 మ్యాచ్‌ల్లో 109 విజయాలు) జట్లు ఉన్నాయి.
After CSK, MI & KKR, now RCB have 100 IPL win under their belt. 👏👏#IPL2022 #RRvsRCB pic.twitter.com/ulTWUjppLW
— Dr. Cric Point (@drcricpoint) April 5, 2022
ఇది కూడా చదవండి: RCBకి రెండో గెలుపు.. ఆ ఒక్క ఓవర్ వల్లే..!
ఐపీఎల్‌లో తమ జట్టు వందో విజయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌లో ఆటగాళ్లతో పాటు ఆర్సీబీ బృంద సభ్యులంతా పాల్గొని రచ్చరచ్చ చేశారు. ఆర్సీబీ యాజమాన్యం వెరైటీ వంటకాలతో కూడిన ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఆర్సీబీ నినాదాలతో డ్రెస్సింగ్ రూమ్ మార్మోగిపోయింది.లీగ్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ.. ఇది కొంచెం ఉత్సహాన్ని కలిగించే అంశమే.
A century of wins. Countless unforgettable memories. 💯🥳#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/jvWNOW8mIq
— Royal Challengers Bangalore (@RCBTweets) April 6, 2022
RCB Yesterday Became The Fourth IPL Team To Register 100 Wins!
.
.#Cricket #IPL #IPL2022 #MI #CSK #KKR #RCB pic.twitter.com/bGNhMCERei— CRICKETNMORE (@cricketnmore) April 6, 2022
ఇది కూడా చదవండి: పరుగులు ఇవ్వడంలో తగ్గేదేలే! ముగ్గురూ ముగ్గురే..!