ప్రస్తుతం విరాట్ కోహ్లీ రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ రికార్డులు క్రికెట్ లో కాదు.. సోషల్ మీడియాలో. ఇప్పటికే నెట్టింట ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ.. తాజాగా ఒక క్రేజీ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ స్టార్ బ్యాటర్ మ్యాచ్ ఆడుతుంటే స్టేడియం నిండిపోతుంది. ఇక బౌండరీలు కొడుతుంటే అభిమానుల అరుపులతో హోరెత్తడం ఖాయం. కోహ్లీ అంటే క్రేజ్ చిరునామాగా మారాడు. ప్రస్తుతం ఇండియాలో కోహ్లీకి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదు. సోషల్ మీడియానే ఇందుకు సాక్ష్యం. సోషల్ మీడియాలో కోహ్లీ ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. మొన్నటివరకు ఇండియాలోనే టాప్ గా నిలిచినా కోహ్లీ ఇప్పుడు ఒక విషయంలో ఆసియాలోనే టాప్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. మరి కోహ్లీ నెలకొల్పిన ఆ క్రేజీ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ రికార్డులు క్రికెట్ లో కాదు.. సోషల్ మీడియాలో. ఇప్పటికే నెట్టింట ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ.. తాజాగా ఒక క్రేజీ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ లో ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్‌గా ఉన్న కోహ్లీ.. ఇప్పుడు తన రేంజ్‌ను ఇండియా దాటి ఆసియా ఖండాన్ని కూడా విస్తరించాడు. ఇన్‌స్టాలో మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న అథ్లెట్లలో కోహ్లీ.. ఏకంగా 250 మిలియన్స్ ఫాలోవర్స్ తో మరెవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఆసియా ఖండంలో ఇంతమంది ఫాలోవర్లు కలిగిన స్పోర్ట్స్‌మెన్ మరొకరు కోహ్లీ స్టామినాను తెలియజేస్తుంది.
ఈ లిస్టులో ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టాలో 585 మిలియన్స్ ఫాలోవర్స్ తో టాప్ లో నిలవగా.. రెండో స్థానంలో 462 మిలియన్స్ ఫాలోవర్స్ తో లియోనల్ మెస్సీ ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత మూడో స్థానాన్ని కోహ్లీ దక్కించుకోవడం గమనార్హం. భారత్ లో అయితే కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కోహ్లీకి 25 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు ఇన్‌స్టాలో 40.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టీమిండియాకు మూడు ఐసీసీ వరల్డ్ కప్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనికి 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి కోహ్లీ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.