ఐపీఎల్ లో ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా ఆర్సీబీ జట్టు ఇంటి దారి పట్టింది. ఆఖరి లీగ్ మ్యాచులో గుజరాత్ మీద ఖచ్చితంగా గెలిస్తే ప్లే ఆఫ్ ఖాయమనుకుంటున్న దశలో పోరాడి ఓడిపోయింది. దీంతో ఎప్పటిలాగే కోహ్లీ భావోద్వేగం, ప్లేయర్లు నిరాశ. కానీ అభిమానులు మాత్రం ఈ సారి కాస్త సహనం కోల్పోయినట్లుగా కనిపిస్తుంది.
“రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు” పేరుకి తగ్గట్లే ఈ జట్టు రాయల్ గా కనిపిస్తుంది. ప్రతి సీజన్ లో స్టార్ ప్లేయర్లతో కళకళలాడుతూ ఉంటుంది. సీజన్ ప్రారంభంలో “ఈ సాలా కప్ నందే” అనే స్లోగన్ తో వచ్చి వీరు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆర్సీబీ మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో జనాలు కిక్కిరిసిపోతారు. దీనికి కారణం రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేంతో ప్రతి సీజన్ లో ఆర్సీబీ ఖచ్చితంగా టైటిల్ ఫేవరేట్ లిస్టులో ఉంటుంది. అయితే బోలెడు ఆశలు పెట్టుకున్న అభిమానులని మాత్రం ఎప్పటికప్పుడు నిరాశనే మిగిలిస్తుంది. ఇప్పటివరకు 16 సీజన్లు ఆడినా.. ట్రోఫీ గెలవడంతో విఫలమవుతుంది. దీంతో అభిమానులు ఇక ఓపిక కూడా నశించి పోయినట్లుగా కనిపిస్తుంది.
ఐపీఎల్ లో ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా ఆర్సీబీ జట్టు ఇంటి దారి పట్టింది. ఆఖరి లీగ్ మ్యాచులో గుజరాత్ మీద ఖచ్చితంగా గెలిస్తే ప్లే ఆఫ్ ఖాయమనుకుంటున్న దశలో పోరాడి ఓడిపోయింది. దీంతో ఎప్పటిలాగే కోహ్లీ భావోద్వేగం, ప్లేయర్లు నిరాశ అభిమానుల ఆందోళన జరిగిపోయాయి. ఇదిలా ఉండగా అభిమానులకి ఈ సారి కాస్త సహనం కోల్పోయారని చెప్పాలి. దీంతో ఆర్సీబీ ఓటమిలో కీలక పాత్రా వహించిన గిల్, అతని చెల్లి మీద దారుణంగా ట్రోల్స్ చేశారు. ఆర్సీబీ యాజమాన్యానికి ఒక ఉచిత సలహా ఇస్తున్నారు. జట్టులో కోహ్లీ, డుప్లెసిస్, సిరాజ్, మ్యాక్స్ వెల్ మినహా ఎవరూ సరిగా ఆడలేకపోయారు. ఈ విషయంపై ప్రస్తావిస్తూ.. ఆర్సీబీ యాజమాన్యానికి ఒక ఉచిత సలహా ఇస్తున్నారు అభిమానులు.
‘ఈ టీమ్ మేనేజ్‌మెంట్ మొత్తాన్ని రద్దు చేయండి. వాళ్ల వల్ల టీమ్‌కి ఎలాంటి లాభం లేదు. టీమ్‌ని అభిమానులకు ఇవ్వండి, మేం సరైన ప్లేయర్లతో టీమ్‌ని నిర్మిస్తాం. ఒకవేళ ఫండ్స్ లేకపోతే చందాలు వసూలు చేసి టీమ్‌ని నిర్మిస్తాం.. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అని ప్రతీసారీ ఆశపడడం, నిరాశపడడం అలవాటైపోయింది. ఇక మా వాళ్ల కాదు.. ’ అంటూ కామెంట్ చేశాడు ఓ ఆర్‌సీబీ అభిమాని. సరైన బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ యూనిట్ కానీ లేకుండా ఆర్‌సీబీ, ఎన్ని సీజన్లు ఆడినా టైటిల్ గెలవడం కష్టం. బేస్ ప్రైజ్ ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరితే, ఒక్కో ప్లేయర్లకు పదేసి కోట్లు పెట్టిన ఆర్‌సీబీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు.మరి ఆర్సీబీ అభిమానులు చేసిన ఈ కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.