"ఆకాష్ మద్వాల్" ప్రస్తుతం ఈ పేరు ముంబై ఇండియన్స్ జట్టుకి కొండంత బలంగా మారింది. దానికి కారణం ఏంటని పరిశీలిస్తే.. అతని బౌలింగ్ అని తెలుస్తుంది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఒంటి చేత్తో ముంబైకి విజయాన్నందించాడు.ఈ నేపథ్యంలో సంతోషంగా ఉండాల్సిన ఈ యంగ్ పేసర్ బాధతో కాస్త ఎమోషనల్ అయ్యాడు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తన జయభేరిని మోగిస్తుంది. గుజరాత్ తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ ఓడిపోవడం వలన అదృష్టవశాత్తు ప్లే ఆఫ్ కి చేరింది ముంబై ఇండియన్స్. ఇక నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై అన్ని విభాగాల్లో రాణించి లక్నో సూపర్ జయింట్స్ మీద గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. దీంతో గుజరాత్ మీద క్వాలిఫయర్ 2 ఆడేందుకు రెడీ అయింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఆకాష్ మద్వాల్. ఈ నేపథ్యంలో సంతోషంగా ఉండాల్సిన ఈ యంగ్ పేసర్ బాధతో కాస్త ఎమోషనల్ అయ్యాడు.
“ఆకాష్ మద్వాల్” ప్రస్తుతం ఈ పేరు ముంబై ఇండియన్స్ జట్టుకి కొండంత బలంగా మారింది. దానికి కారణం ఏంటని పరిశీలిస్తే.. అతని బౌలింగ్ అని తెలుస్తుంది. జట్టులో స్టార్ బ్యాటర్లతో కళకళలాడే ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో మాత్రం బాగా బలహీనంగా కనిపించింది. బుమ్రా, ఆర్చర్, రీచర్డ్సన్ లాంటి స్టార్ బౌలర్లు లేని కొరత స్పష్టంగా కనిపించింది. అయితే వారి లేని లోటు తీరుస్తూ ఆకాష్ ముంబై జట్టుకి ఒక వరంలా మారాడు. ఈ సీజన్ లో ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి తనను తాను నిరూపించుకున్న ఈ యంగ్ పేసర్.. నిన్న జరిగిన మ్యాచులో ఒంటి చేత్తో ముంబైకి విజయాన్నందించాడు. 3.3 ఓవర్లు వేసిన ఆకాష్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ లో ఇలాంటి స్పెల్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. 5 వికెట్లు తీయడమే గొప్ప ఘనత అయితే.. పొదుపుగా బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు. ఈ సందర్భంగా ఆకాష్ మద్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. “2019లో ఆర్సీబీ జట్టులో నెట్ బౌలర్ గా ఉన్నాను. కానీ నాకు అప్పుడు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు నన్ను తీసుకొని నాకు అవకాశం ఇచ్చింది”. అని ముంబై టీం ని ప్రశంసిస్తూనే ఆర్సీబీ నాకు అవకాశాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. మరి మొత్తానికి ఈ యంగ్ సంచలనం చేసిన కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.