పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. గతంలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ కోహ్లీనే అధికారికంగా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశాడు. ఎంతో సమయం తీసుకుని, ఎంతగానో ఆలోచించిన తర్వాత తీసుకున్న నిర్ణయం అని తెలిపాడు. ఈ అశంపై రవిశాస్త్రి, గంగూలీ, జేషా, రోహిత్ శర్మ, సెలక్టర్లు అందరితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు.
టీమిండియా వన్డే, టెస్టు జట్టుకు కెప్టెన్‌గా.. టీ20 జట్టులో ఆటగాడిగా కొనసాగుతానని తెలిపాడు. కెప్టెన్‌గా ఉండటం ఎంత ముఖ్యమో.. తన వంతుగా టీమిండియా విజయంలో భాగం కావడం కూడా అంతే ప్రధానమని తెలిపాడు. గత 9 సంవత్సరాలుగా అన్ని ఫార్మాటుల్లో ఆడుతున్నాను. రెగ్యులర్ కెప్టెన్‌గా దాదాపు 5 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నాను. టెస్టు, వన్డే క్రికెట్‌లో టీమిండియాకి సారథ్యం వహించేందుకు నాకు కొంచం సమయం కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021