టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా కాస్త లేటుగా జాతీయ జట్టులోకి వచ్చినా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో కొత్త టీమ్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడిన దీపక్ హుడా సీజన్ మొత్తం మంచి ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2022లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన హుడా 136.67 స్ట్రైక్‌రేట్‌తో 451 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌తో టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 5 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. వన్డేల్లో 115 పరుగులు చేశాడు. టీ20ల్లో 215 రన్స్ కొట్టాడు. టీ20ల్లో హుడాకు ఒక సెంచరీ కూడా ఉంది.
విశేషం ఏమిటంటే.. హుడా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ టూర్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జింబాబ్వే టూర్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్‌లు, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ ప్రస్తుతం టీమిండియా ముందున్న లక్ష్యాలు. వీటి కోసం జట్టును పటిష్టం చేసుకునేందుకు జట్టులో అనేక ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగాల్లో హుడా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
అలాగే బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు అదనపు బలంగా నిలుస్తున్నాడు. దీంతో దీపక్ హుడాను టీ20 వరల్డ్ కప్ కోసం జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. పైగా హుడా ఆడిన ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా ఓడిపోకపోవడం కూడా అతని స్థానాన్ని బలపరుస్తుంది. అతను జట్టులో ఉంటే టీమిండియా అదృష్టం కూడా కలిసి వస్తుందని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
12 internationals for Deepak Hooda; 12 wins for Team India. #WIvIND pic.twitter.com/gmKbU0L8KJ
— Wisden India (@WisdenIndia) August 3, 2022
ఇది కూడా చదవండి: టీమిండియాలో మరో భారీ మార్పు! పాపం.. కేఎల్ రాహుల్!