భారత క్రికెట్ అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేసిన ఐసీసీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇండియాను అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో చూపిన ఐసీసీ, సాయంత్రం అవ్వగానే రూటు మార్చింది. తిరిగి ఆసీస్ జట్టుకు అగ్రస్థానాన్ని అప్పగించింది. ఇదంతా ఐసీసీ చేసిన తప్పిదం కారణంగానే జరిగింది. అదేంటన్నది కింద చూడండి..
“భళా టీమిండియా!.. క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ మనమే టాప్..” ఉదయం నుంచి భారత్ అగ్రస్థానానికి చేరిందని ఎన్ని కథనాలు వెలువడ్డాయి అందరకి తెలిసిందే. ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్నామంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్ ల తోటి కథనాలు వచ్చాయి. చివరకు రోజు గడిచేలోపే అదంతా తలకిందులైంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చేసిన తప్పిదం కారణంగానే భారత్ మూడు ఫార్మట్లలో నంబర్ వన్‌గా నిలిచిందట. తప్పిదాన్ని సరిద్దిద్దిన ఐసీసీ.. తిరిగి ఆస్ట్రేలియాను అగ్రస్థానంలో కుర్చోపెట్టింది. ఎందుకిలా జరిగింది..? ఐసీసీ చేసిన ఆ తప్పిదమేంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా టెస్ట్ ఫార్మాట్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. 115 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలవగా, 111 పాయింట్లతో ఆసీస్ 2వ స్థానంలో ఉంది. ఇది ఫిబ్రవరి 15న ఉదయం నుంచి సాయంత్రం వరకు.. అదే ఇప్పుడు 126 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, 115 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. జరిగిన తప్పిదం ఏమిటంటే.. ఐసీసీ లెక్కల ప్రకారం ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ కూడా ముగిసి.. అందులో కూడా భారత్ విజయం సాధిస్తే అప్పుడు టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకుతుంది.
India’s dominance in world cricket! 🔥#CricTracker #INDvAUS #ICCRankings pic.twitter.com/NlUkv6GX3T
— CricTracker (@Cricketracker) February 15, 2023
మొత్తానికి 6 గంటల తర్వాత జరిగిన పొరపాటును గ్రహించిన ఐసీసీ.. మళ్లీ కొత్త ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దీనిలో టీమిండియా మళ్లీ రెండవ స్థానంలోని వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తదుపరి మ్యాచ్ ఎల్లుండి ఢిల్లీ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు నంబర్ 1 పీఠాన్ని అధిరోహిస్తుంది. అప్పుడు భారత్‌కు 121 పాయింట్లు, ఆస్ట్రేలియాకు 120 పాయింట్లు ఉంటాయి. కాగా, ఈ తప్పిదంపై ఐసీసీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. ఏదేమైనా.. ప్రపంచ క్రికెట్‌లో 6 గంటలపాటు టీమిండియా అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగిందనే చెప్పాలి. ఐసీసీ చేసిన తప్పిదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An update on the No. 1 men’s teams in the ICC rankings
Test: 🇦🇺
ODI: 🇮🇳
T20I: 🇮🇳🔗 https://t.co/RrXVsjCw0o pic.twitter.com/8ukcOQTuXw
— ESPNcricinfo (@ESPNcricinfo) February 15, 2023