IND vs ZIM 3rd ODI: హరారే వేదికగా జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే జట్టు గెలిచినంత పని చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫలితంగా భారత జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే బ్యాటర్ సికిందర్ రాజా(115) అఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే జట్టుకు శుభారంభం అందించలేదు. 7 పరుగులకే తొలి వికెట్(ఇన్నొసెంట్ కాయా (6)) కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సీన్ విలియమ్స్(45) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండవ వికెట్ కు కైటానో (13) తో కలిసి 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆపై క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు మున్యోంగా (15), చకాబ్వా (16), ర్యాన్ బర్ల్ (8), ల్యూక్ జాంగ్వే (14) ఎవరూ రాణించలేదు. అయినా సరే పట్టువదలకుండా పోరాడిన సికందర్ రాజా (115) జట్టును గెలిపించినంత పని చేశాడు. చివర్లో గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో జింబాబ్వే జట్టు 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది.
What a remarkable knock from the Zimbabwe legend, Sikandar Raza. He surely won our hearts today. ❤️
115 runs from just 95 balls. 🙏#INDvsZIM #3rdODI #SikandarRaza #Century #PowerfulKnock pic.twitter.com/KlcHXJ5DZ7
— Malik Rizwan dish Network (@Muhamma99093265) August 22, 2022
ఇక.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేయగా, భారత బ్యాటర్లలో శుభ్ మాన్ గిల్ (130), ఇషాన్ కిషన్(50), శిఖర్ ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India whitewash Zimbabwe 3️⃣-0️⃣ in the ODI series 🔥🇮🇳
‘Men in Blue’s dominance in 2022 continue 🙌#IndianCricketTeam #Zimbabwe #ZIMvIND #CricketTwitter pic.twitter.com/jHSfx5jofT
— Sportskeeda (@Sportskeeda) August 22, 2022