పాకిస్తాన్ టూర్ ఆఫ్ 2022లో భాగంగా జరిగిన మూడు వన్డేల్లో విజయం సాధించిన పాక్.. ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సిరీస్ ను వైట్ వాష్ చేసిన పాకిస్తాన్ ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే మూడో వన్డేలో కేవలం 9 పరుగుల తేడాతో ఓడిన నెదర్లాండ్స్ జట్టు పాకిస్తాన్ కు ఓటమి భయాన్ని చూపించారు. వైట్ వాష్ సంగతి తర్వాత ముందు పరువు నిలబెట్టుకోవాలి అనే పరిస్థితికి చేర్చారు. కానీ, అదృష్టం కలిసిరాక ఓటమి పాలయ్యారు. మొదటి వన్డోలోనూ 298 పరుగులు చేసి 16 పరుగుల వద్ద మ్యాచ్ ఓడిపోయారు. మూడు వన్డేల్లో నెదర్లాండ్స్ ఓటమిపాలైనా.. క్రికెట్ ప్రియుల నుంచి మాత్రం మన్ననలు అందుకుంటున్నారు. అంతటి పోరాట పటిమ కనబరిచిన జట్టు విషయంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చేసిన వ్యాఖ్యలు ఒకింత కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. On a lighter note: “Credit to Scotland bowlers for restricting us in the first innings”, says @babarazam258 Well done #greenshirts for yet another feat. — Jibran Shafa (@JabranShafa) August 21, 2022 మ్యాచ్ అనంతరం బాబర్ అజామ్ మాట్లాడుతూ.. “సిరీస్ గెలవడంపై సంతోషంగా ఉంది. క్రెడిట్ మొత్తం బౌలర్లకే దక్కుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో చక్కగా బౌలింగ్ చేశారు. నషీమ్ షా ఎంతో చక్కగా బౌలింగ్ చేశాడు. డెత్ ఓవర్లో కొత్త బంతితో నషీమ్ చక్కగా బౌల్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో పరుగులు ఎక్కువగా రాబట్టలేకపోయాం. ఆ క్రెడిట్ అంతూ స్కాట్లాండ్ బౌలర్లకే దక్కుతుంది. వాళ్లు చాలా చక్కగా బౌలింగ్ చేశారు” అంటూ చెప్పుకొచ్చాడు. Babar azam: full credit goes to Scotland bowlers and they ain’t even playing dutch squad be like give us a lil respect Mr No 1#NEDvPAK pic.twitter.com/zY55Kmo4uS — Einstein. (@TheAlbertEin) August 21, 2022 ఈ మాటలు విన్న నెటిజనులు బాబర్ అజామ్‌పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అసలు ఏ జట్టుతో ఆడుతున్నావో కూడా తెలియకుండా పోతోందా? లేక వైట్ వాష్ చేసిన ఆనందంలో మైండ్ పని చేయడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పొరపాటున అలా చెప్పావా? లేక కావాలనే వాళ్లను కించపరిచావా అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాబర్ కు నెదర్లాండ్స్ కు స్కాట్లాండ్ కు కూడా తేడా తెలియదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. బాబర్ అజామ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Lord babar speaks #PAKvsNED #Scotland #BabarAzam #AsiaCup2022 #PakistanCricket https://t.co/zTmzNcFdVR — Rohit (@its_Rohit_264) August 22, 2022 Stop trolling #BabarAzam #Netherlands #Scotland confusion. He used to take name of #Zimbabwe only in majority of his press conferences. And just appreciate his fastest 91(125) in history of cricket also biggest victory of 9 runs against Mighty #NED . #PAKvsNED — Public Polls (@PublicPolls000) August 22, 2022 ఇదీ చదవండి: షాహీన్ ఆఫ్రిదీ ప్లేస్‌లో నిషేధిత బౌలర్‌ని పట్టుకొచ్చిన పాకిస్తాన్..! ఇదీ చదవండి: టీమిండియా చేతిలో మళ్ళీ ఓడిపోతారా? పాక్ టీమ్ పై ఆ దేశ ప్రజలు ఫైర్!