మీరు నాని ‘జెర్సీ’ సినిమా చూశారా? అందులో ఓ మ్యాచ్ సందర్భంగా నాని పరుగెత్తడానికి ఇబ్బంది పడతాడు. కాసేపు ఆగి శ్వాస తీసుకుని మళ్లీ గేమ్ కొనసాగిస్తాడు. అయితే మునుపటిలా మాత్రం పరుగెత్తలేకపోతాడు. ఇది సినిమాలో సీన్ కావొచ్చు. కానీ టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ విషయంలో ఇలానే జరిగింది. ఇప్పుడు అదే అభిమానుల్లో ఎక్కడలేని టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే విరాట్.. ఒక్కసారిగా ఇలా అయిపోవడం చూసి ఏమైందోనని ఆందోళన […]
టీమిండియా, జింబాబ్వే జట్టుపై అద్భుత విజయం సాధించింది. 71 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశని అగ్రస్థానంతో ముగించింది. ఇకపోతే వన్ సైడ్ గా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే మిస్టర్ 360 అనే పదానికి పూర్తి న్యాయం చేశాడు. జింబాబ్వే బౌలర్లు ఎటు వైపు వేసినా సరే బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రియాలిటీలో అదే చేసి చూపించాడు. అతడు […]
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. రెండోది అసలు అవకాశం కూడా లేదు అనుకున్న పాకిస్తాన్ జట్టు సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిన పాక్.. మిగిలిన జట్లు చేసిన తప్పిదాల వల్ల పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరింది. ఇంక ఆదివారం జరుగుతున్న మరో మ్యాచ్ భారత్- జింబాబ్వే మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి […]
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడం ఏమో గానీ ఆ దేశానికి కొందరు మాత్రం ఇంకా అదేపనిగా మనపై పడి ఏడుస్తున్నారు. అందులో పాక్ నటి షెహరి షిన్వారి ఒకరు. టోర్నీ మొదలైనప్పటి నుంచి భారత్ ఆ జట్టు చేతిలో ఓడిపోవాలి, ఈ జట్టు చేతిలో ఓడిపోవాలి అని తెగ శాపనార్థాలు పెడుతోంది. మన నెటిజన్స్ పెద్దగా ఆమెని పట్టించుకోవట్లేదు గానీ ఆప్ఘనిస్థాన్ కి చెందిన వాళ్లు మాత్రం వరసపెట్టి కౌంటర్లు వేస్తున్నారు. […]
IND vs ZIM 3rd ODI: హరారే వేదికగా జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే జట్టు గెలిచినంత పని చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫలితంగా భారత జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే బ్యాటర్ సికిందర్ రాజా(115) అఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. […]
IND vs ZIM 3rd ODI: జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. ఇది తన కెరీర్ లో తొలి సెంచరీకాగా, ఈ సెంచరీతో సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 15 ఫోర్లు, ఒక సిక్సర్ తో 130 పరుగులు సాధించాడు. దీంతో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు జింబాబ్వేపై అత్యధిక వ్యక్తిగత […]
తొలి వన్డేలో మీసం మెలేసేలా.. వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించిన టీమిండియా రెండో వన్డేలో చచ్చీ చేడి, పడుతూ లేస్తూ గెలిచింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యం.. అది కూడా పసికూన జింబాబ్వేతో. తొలి వన్డేలోలానే సునాయాసంగా విజయం సాధిస్తారనుకుంటే.. గెలిచాం చాలు అనేవరకు తీసుకొచ్చారు. మొత్తానికి 5 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత జట్టు, వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన కెప్టెన్ కేఎల్ […]
IND vs ZIM 2nd ODI: తొలి వన్డేలో చేతులెత్తేసిన జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ రెండో వన్డేలోనూ చేతులెత్తేశారు. టీమిండియా పేసర్ల ధాటికి సింగిల్ డిజిట్ కే పెవిలియన్ బాటపట్టారు. సీనియర్లు.. సికందర్ రజా (16), సీన్ విలియమ్స్ (42) కాసేపు ఆదుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. తొలి వన్డేలో 189 పరుగులకు ఆలౌట్ అయిన జింబాబ్వే రెండో వన్డేలో 161 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం.. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా ఇన్నింగ్స్ ను ధాటిగానే ప్రారంభించింది. కేఎల్ […]
IND vs ZIM 1st ODI: జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. మొదట బౌలర్ల అద్భుత ప్రదర్శనకు తోడు ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్ – శుభ్‌మన్ గిల్ రాణించడంతో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. 190 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీం ఇండియా ఓపెనర్లే అలవోకగా టార్గెట్ పూర్తి చేశారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 30.5 ఓవర్లలోనే 192 పరుగులతో జట్టును గెలిపించారు. ఈ […]
IND vs ZIM 1st ODI: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. హరారే వేదికగా జరుగుతున్నఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. ఆట ప్రారంభానికి ముందు భారత క్రికెటర్లు జనగణమన ఆలపిస్తూ కనిపించారు. ఈ సమయంలో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కళ్లు మూసుకుని జాతీయగీతం ఆలపిస్తుండగా ఓ తేనెటీగ అతని చెవిలో దూరే ప్రయత్నం చేసింది. కానీ ఇషాన్ చాకచక్యంగా ఆ తేనెటీగ నుంచి తప్పించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో […]