IND vs ZIM 2nd ODI: తొలి వన్డేలో చేతులెత్తేసిన జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ రెండో వన్డేలోనూ చేతులెత్తేశారు. టీమిండియా పేసర్ల ధాటికి సింగిల్ డిజిట్ కే పెవిలియన్ బాటపట్టారు. సీనియర్లు.. సికందర్ రజా (16), సీన్ విలియమ్స్ (42) కాసేపు ఆదుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. తొలి వన్డేలో 189 పరుగులకు ఆలౌట్ అయిన జింబాబ్వే రెండో వన్డేలో 161 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం.. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా ఇన్నింగ్స్ ను ధాటిగానే ప్రారంభించింది. కేఎల్ రాహుల్ ను త్వరగా కోల్పోయినప్పటికీ.. శిఖర్ ధావన్, శుభ్ మాన్ గిల్ ఆదుకున్నారు. ఈ క్రమంలో జింబాబ్వే బౌలర్.. తనకా చివంగా అత్యుత్సాహం ప్రదర్శించాడు.
సిరీస్ ప్రారంభానికి ముందు.. మేము గట్టి పోటీ ఇస్తాం, సిరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకుంటాం అని ప్రగల్భాలు పలికిన జింబాబ్వే బ్యాటర్లు ముడుచుకు పోయారు. గట్టీ పోటీ కాదు.. మూడెంకెల స్కోర్ దాటించడానికి నానా తంటాలు పడుతున్నారు. పూర్తి ఓవర్లు ఆడకుండానే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్(1) ను త్వరగా కోల్పోయినప్పటికీ.. ఇన్నింగ్స్ ను ధాటిగానే ప్రారంభించింది. అనంతరం శిఖర్ ధావన్, శుభమాన్ గిల్ జోడీ 2 వికెట్ కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో ధావన్ (21 బంతుల్లో 33) పరుగుల వద్ద తనకా చివంగా బౌలింగ్ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఈ తరుణంలో జింబాబ్వే బౌలర్ తనకా చివంగా అత్యుత్సాహం ప్రదర్శించాడు. గట్టిగా అరుస్తూ ఓవర్ యాక్షన్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆరంభంలో పేసర్లు రాణించడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సికందర్ రజా (16), షాన్ విలియమ్స్ (42) ఇద్దరూ కాసేపు ఆదుకున్నారు. విలియమ్స్ అవుటైన తర్వాత ర్యాన్ బర్ల్ (39 నాటౌట్) కూడా రాణించాడు. అయితే మిగతా బ్యాటర్లు కైటానో (7), ఇన్నొసెంట్ కాయా (16), మధెవెరె (2), రెగీస్ చాకబ్వా (2), ల్యూక్ జాంగ్వే (6), బ్రాడ్ ఎవాన్స్ (9), విక్టర్ న్యూచీ (0), తనక చివాగ (4) ఎవరూ రాణించలేదు. దీంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకు జింబాబ్వే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసుకోగా.. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీసుకున్నారు.
Both Indian openers are dismissed as Shikhar Dhawan departs after a quickfire opening knock 🏏#ShikharDhawan #India #ZIMvIND #CricketTwitter pic.twitter.com/JK21pJeUHL
— Sportskeeda (@Sportskeeda) August 20, 2022