అభిమాన క్రికెటర్లు కనిపిస్తే మనలో చాలామంది ఫొటోల కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడతాం. వాళ్లు బిజీగా ఉంటే మనల్ని పట్టించుకోకుండా వెళ్లిపోతారు. లేదా వాళ్ల సెక్యూరిటీ పక్కకు తోసేస్తారు. కానీ.. ఆ ప్లేయర్ తన భుజంపై చేయి వేసి సెల్ఫీ తీసుకునేందుకు అనుమతి ఇస్తే.. ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. జరిగ్గా ఇదే సంతోషాన్ని జింబాబ్వే లేడీ ఫ్యాన్ ఒకామె పొందింది. మ్యాచ్‌లో పదునైన బంతులతో ప్రత్యర్థి పని పట్టి మ్యాచ్ గెలవడంతోపాటు.. హుందాతనంతో అభిమానుల చిరు కోరికను మన్నించి దీపక్ చాహర్ వారి మనసులను సైతం గెలుచుకున్నాడు. జింబాబ్వేతో తొలి వన్డే తర్వాత దీపక్ చాహర్ స్టేడియంలోని అభిమానులను పలకరించాడు. ఈ క్రమంలో జింబాబ్వే లేడీ ఫ్యాన్ ‘నిన్ను తాకొచ్చా;’ అని అడిగింది. దీపక్ చాహర్ సరై అనడంతో ఆమె సంతోషంగా అతని భుజంపై చేయి వేసి సెల్ఫీ తీసుకుని తెగ సంబురపడిపోయింది. ఈ విషయంపై దీపక్ చాహర్‌తో సెల్ఫీ దిగిన మహిళాభిమాని స్పందిస్తూ.. ‘‘చాహర్ ఎంతో అణకువతో మెలిగాడు. తనతో ఫొటో దిగడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. తనను తాకే అవకాశం నాకు ఇవ్వడం మామూలు విషయం కాదు(నవ్వులు).. చాలా మంది ఇతరులు తమను తాకడానికి ఏమాత్రం ఇష్టపడరు. చాహర్ మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించాడు’’ అని చెప్పుకొచ్చింది. ఇక అభిమానులతో ఇంట్రాక్ట్ కావడంపై చాహర్ స్పందిస్తూ.. ‘ఫ్యాన్స్‌తో ఇలా కలిసిపోవడం కూడా గొప్పగానే ఉంటుంది కదా!’ అని పేర్కొన్నాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన దీపక్ చాహర్ జింబాబ్వేతో తొలి వన్డేలో మంచి ప్రదర్శన కనబర్చాడు. 7 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 27 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు చహర్. మరి జింబాబ్వే ఫ్యాన్ రిక్వెస్ట్‌కు చాహర్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: అందరిని నేను భయపెడితే.. అతను నన్ను వణికించే వాడు: అక్తర్