భారత్ – సౌతాఫ్రికా టీ20 సిరీస్ సమరానికి అంతా సిద్దమైంది. గురువారం(జూన్ 9) రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. భారత్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడేందుకు ఉపఖండానికి వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. దక్షిణాదిలో వాతావరణం కాస్త చల్లబడ్డా ఉత్తరాదిలో మాత్రం భానుడు ఇంకా ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో ప్రాక్టీస్ సెషన్స్ కు వస్తున్న సఫారీ ఆటగాళ్లకు చుక్కలు కనబడుతున్నాయి. ఇవేం ఎండల్రా బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. మేము.. ముందిగానే అంచనా వేశాం .. కానీ, ఈ రేంజ్ లో ఉంటాయని అంచనా వేయలేదని చెప్తున్నారు.
ఇదే విషయమై ప్రొటీస్ జట్టు సారథి టెంబ బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఎండల నుంచి బాడీ డీహైడ్రేట్ అవకుండా ఉండటానికి గాను అతడు జట్టు ఆటగాళ్లకు కీలక సలహాలిచ్చాడు. “భారత్ లో ఈ సమయంలో ఎండలు దంచికొడతాయని మేం ముందుగానే అంచనా వేశాం. కానీ ఇంత వేడిని మాత్రం ఊహించలేదు. అయితే.. మేం ఆడబోయే మ్యాచులు రాత్రి ఉండటం వల్ల మేం బతికిపోయాం. ఇక.. ప్రాక్టీస్ సెషన్స్ లో ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నాం. మా ఆటగాళ్లు డీహైడ్రేట్ అవకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలని వారికి సూచిస్తున్నా. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నట్లయితే.. ఇంట్లో కూర్చొని బీర్లు తాగేవారు. కానీ ఇక్కడ తాగాల్సింది బీర్ కాదు.. ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే నీళ్లు ఎక్కువ తాగాలి. అదే మా ఆటగాళ్లకు చెబుతున్నా. అలా అయితే ఫిజికల్ గానే గాక మెంటల్ గానూ రిఫ్రెష్ అవుతాం..” అని తెలిపాడు.
South African team affected by heat in India. The temperature in Delhi is around 45 degree Celsius.
“We expected it to be hot, but not this hot,” Temba Bavuma said. “We’re fortunate that the games are being played at night, when it’s bearable.” #INDvSA pic.twitter.com/pywVBn14W3
— CBTF Speed News (@cbtfspeednews) June 9, 2022
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. గురువారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల దాకా ఉండొచ్చని అంచనా. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి కాస్త తగ్గినా వడగాలులు, ఉక్కపోత మాత్రం తగ్గకపోవచ్చు అని సమాచారం. ఇక.. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచుల్లో తలపడగా.. 9 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించింది. మిగిలిన ఆరు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా గెలుపొందింది.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్
మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ
రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్
మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం
నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్‌కోట్
ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు