గత ఏడాది పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొని టీ20ల్లో కెప్టెన్సీని సైతం పోగొట్టుకున్నాడు టెంబా బవుమా. అయితే ఇదంతా కొన్ని రోజుల కిందట ముచ్చట. ఇప్పుడు అతడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అద్భుత ఫామ్ లో ఉన్న బవుమా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దాంతో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు.
సాధారణంగా క్రికెట్ లో ఏ ఆటగాడు అయిన కఠినమైన రోజులను ఎదుర్కొవాల్సి వస్తుంది. కెరీర్ లో ఫామ్ కోల్పోయినప్పుడు ఇంటా.. బయట తీవ్ర విమర్శలను ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది. వరల్డ్ క్రికెట్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్న క్రికెటర్ ఎవరు అంటే వెంటనే దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అని సమాధానం వస్తుంది. గత ఏడాది పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొని టీ20ల్లో కెప్టెన్సీని సైతం పోగొట్టుకున్నాడు. అయితే ఇదంతా కొన్ని రోజుల కిందట ముచ్చట. ఇప్పుడు అతడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అద్భుత ఫామ్ లో ఉన్న బవుమా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దాంతో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టెంబా బవుమా.. వరల్డ్ క్రికెట్ లో ప్రస్తుతం మారుమ్రోగుతున్న పేరు. కొన్ని రోజుల క్రితం ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న బవుమా.. తాజాగా ఆ విమర్శలన్నింటికి తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు. అది మామూలు సమాధానం కాదు. ఏకంగా కోహ్లీ సరసన నిలిచి తనపై విమర్శలు గుప్పించిన వారికి, తన సత్తా ఏంటో చూపించాడు.ఈ ఏడాది అద్భుత ఫామ్ లో ఉన్న బవుమా.. ఆడిన ఐదు వన్డే మ్యాచ్ ల్లో 414 పరుగులు చేసి సత్తా చాటాడు.ఇందులో రెండు శతకాలు, ఓ అర్ధశతకం ఉండటం విశేషం. తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన రెండో వన్డేలో 90 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిచిపించాడు. గతేడాది పూర్ ఫామ్ ను కొనసాగించిన బవుమా.. 2023ను మాత్రం అద్భుతంగా ప్రారంభించాడు.
ఇక ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఆడిన ఐదు వన్డేల్లో వరుసగా.. 36, 109, 35, 144, 90* పరుగులు సాధించాడు. బవుమా యావరేజ్ 103.5 ఉండగా.. స్ట్రైక్ రేట్ 116.9గా ఉంది. అయితే ఈ క్రమంలోనే టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు బవుమా. వన్డేల్లో 100కుపైగా సగటుతో, 100కు పైగా స్ట్రైక్ రేట్ తో ఒక క్యాలెండర్ ఇయర్లో 400 పరుగులు చేసిన మూడో బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు బవుమా. ఇతడి కంటే ముందు 2012లో ఏబీడీ, 2018లో విరాట్ కోహ్లీలు ఈ ఘనత సాధించారు. విమర్శల పాలైన చోటే ప్రశంసలు అందుకుంటున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.