వెస్టిండిస్ తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక తొలి టెస్ట్ లో విఫలం అయిన సౌతాఫ్రికా సారథి బవుమా.. రెండో టెస్ట్ లో మాత్రం భారీ శతకంతో మెరిశాడు.
ఇటీవలే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. టెస్ట్ కెప్టెన్ డీన్ ఎల్గర్ ని తప్పిస్తూ.. అతని స్థానంలో కొత్త కెప్టెన్ గా టెంబా బవుమా ను టెస్టు కెప్టెన్ గా నియమించింది. ఒక నల్ల జాతీయుడు దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకి కెప్టెన్ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ గా ఉంటున్న బవుమా.. తాజాగా ఆ జట్టు టెస్టు కెప్టెన్ గా కూడా ఎంపిక అయ్యాడు. అయితే బవుమా టెస్టు సగటు చూసుకుంటే కనీసం 35 కూడా లేదు. దీంతో అతని కెప్టెన్సీ మీద భిన్న అభిప్రాయలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే బవుమా విండిస్ తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పడ్డాడు. ఒక కెప్టెన్ గా ఇంత చెత్త ఆరంభం మరొకటి ఉండదు. మొదటి టెస్టు గెలిచినా.. బ్యాటింగ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో డకౌట్ అవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే బవుమా .. బౌన్స్ బ్యాక్ అయిన తీరు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా-వెసిండీస్ జట్ల మధ్య జోహనెస్ బర్గ్ వేదికగా రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 284 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది సౌతాఫ్రికా. ఇక ఈ టెస్టులో మార్క్ రమ్ రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 320 పరుగులు చేసింది. అనంతరం హోల్డర్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో వెస్టిండీస్ 250 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. దీంతో 70 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది దక్షిణాఫ్రికాకి. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ టీమ్.. వెస్టిండీస్ బౌలర్లు విజృంభించడంతో ఒక దశలో 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. త్వరగా మరో 5 వికెట్లు తీస్తే వెస్టిండీస్ టార్గెట్ చాలా ఈజీ అవుతుంది.
ఈ టైంలోనే ఆ జట్టు కెప్టెన్ బవుమా తన టీంకి అన్ని తానై ఉండి అండగా నిలబడ్డాడు. టైలండర్లతో కలిసి జట్టు కి భారీ ఆధిక్యాన్ని అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ముందుకు తీసుకెళ్లిన తీరు అద్భుతం. ఇక రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా జట్టు చేసిన 321 పరుగులో 176 పరుగులు బావుమానే చేయడం విశేషం. టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్ లో పరుగులు చేయడం చాలా కష్టం. కానీ బవుమా సెకండ్ ఇన్నింగ్స్ లో ఒంటి చేత్తో దక్షిణాఫ్రికాను ముందంజలో ఉంచాడు. తొలి టెస్టులో అందరూ బ్యాట్ తో రాణిస్తే.. బావుమా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కానీ రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో అందరూ విఫలమైన చోట బవుమా సత్తా చాటాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో 320, రెండో ఇన్నింగ్స్ లో 321 పరుగులు చేసింది సౌతాఫ్రికా జట్టు. అనంతరం విండీస్ జట్టును తొలి ఇన్నింగ్స్ లో 251 రన్స్ కు రెండో ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌట్ చేసి.. 284 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది దక్షిణాఫ్రికా జట్టు. ఇక మొదటి టెస్టు తర్వాత విమర్శించినోళ్లే ఇప్పుడు బవుమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
A sensational day for Temba Bavuma.
He ends it on 171 not out, the highest score by a South Africa captain since Hashim Amla’s 201 against England at Cape Town in January 2016.#SAvWI pic.twitter.com/WpqpSTX5v5
— Wisden (@WisdenCricket) March 10, 2023