ఇప్పటికే సౌతాఫ్రికా వైట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న టెంబ బవుమాకు టెస్టు కెప్టెన్సీ పగ్గాలు కూడా అందించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. డీన్ ఎల్గర్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించి మరీ.. బవుమాను కెప్టెన్ చేసింది.
దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. కొన్ని సిరీస్ ల నుంచి డీన్ ఎల్గర్ కెప్టెన్సీతో పాటుగా ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు. వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన సిరీస్‌లలో ఓడిపోవడంతో ఎల్గర్ టెస్టు కెప్టెన్సీపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో వెస్టిండీస్ తో ఈ నెల 28న జరగబోయే టెస్టు సిరీస్‌కి ఎల్గర్ ని తప్పిస్తూ సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కొత్త కెప్టెన్‌గా టెంబ బవుమాను నియమించింది. అయితే దక్షిణాఫ్రికా జట్టుకు టెస్టుల్లో ఒక నల్ల జాతీయుడు కెప్టెన్ కావడం ఇదే తొలి సారి.
కాగా.. బవుమా ప్రస్తతం దక్షిణాఫ్రికాకు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు టెస్టు పగ్గాలు కూడా అందడంతో మూడు ఫార్మాట్లలోనూ సౌతాఫ్రికాకు బవుమానే సారథి అయ్యాడు. అయితే.. బవుమా టీ20 క్రికెట్‌కు త్వరలో గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో. టీ20 టీమ్‌కు కొత్త కెప్టెన్ గా మార్కరమ్ ఎంపికయ్యే అవకాశముంది. దీనితో ఇప్పుడు బావుమా వన్డే, టెస్టులకి మాత్రమే పరిమితం కానున్నాడు. 32 ఏళ్ల బవుమా గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఉన్న సఫారీ జట్టులో ఎవరికీ కూడా పెద్దగా అనుభవం కూడా లేదు. దీనితో పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ గా ఉంటున్న బవుమా నే టెస్టుల్లో కూడా కెప్టెన్‌ని చేసింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.
ఇక డీన్ ఎల్గర్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించినా.. ఆటగాడిగా మాత్రం కొనసాగనున్నాడు. ఇప్పటివరకు ఎల్గర్ దక్షిణాఫ్రికా తరపున 17 టెస్టు మ్యాచులకి నాయకత్వం వహించాడు. అందులో 9 మ్యాచులు గెలవగా 7 మ్యాచుల్లో ఓడిపోయింది. తాను కెప్టెన్ గా చేసినా చివరి రెండు సీరీస్ లు ఎల్గార్ మీద వేటు పడడానికి ప్రధాన కారణం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మీద జరిగిన ఈ రెండు సిరీస్ ల్లో కెప్టెన్సీ సంగతి అలా ఉంచితే.. బ్యాట్సమెన్ గా ఎల్గార్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నెల 28 నుండి వెస్టిండీస్ తో సెంచూరియన్ లో తొలి టెస్ట్ జరగనుంది. మరి బవుమాకు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Introducing the new #Proteas Test captain – Temba Bavuma 💪
He remains captain of the ODI side while he has opted to relinquish the captaincy of the T20I side. #BePartOfIt pic.twitter.com/WgsbHhEgss
— Proteas Men (@ProteasMenCSA) February 17, 2023