ఉప్పల్ వేదికగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ అభిమానులకు అసలు మజాను పంచింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత శుభ్‌మన్ గిల్ సిక్సర్లతో విరుచుకుపడి డబుల్ సెంచరీ సాధించగా, అనంతరం కివీస్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో మ్యాచుపై ఆసక్తి రేకెత్తించాడు. 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 140 పరుగులు చేసిన బ్రేస్‌వెల్, భారత ఆటగాళ్లకు ఓటమి భయాన్ని చూపెట్టాడు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత్ నిర్ధేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కివీస్ 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫిన్ అలెన్ (40), డెవాన్ కాన్వే(10), హెన్రీ నిఖోల్స్(18), డారిల్ మిచెల్(9), టామ్ లాథమ్(24).. ఇలా వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రేస్‌వెల్ ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. ఏడో వికెట్ కు మిట్చెల్ సాంట్నర్ తో కలిసి 162 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే.. చివర్లో లోకల్ బాయ్ సిరాజ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. ఆఖరి రెండు ఓవర్లలో న్యూజిలాండ్ విజయానికి 24 పరుగులు వసరం కాగా, 49వ ఓవర్ వేసిన పాండ్యా వికెట్ తీయడమే కాకుండా 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్ లో 20 పరుగులు అవసరం కాగా, బ్రేస్‌వెల్ వికెట్ తీసిన శార్దూల్ భారత్ కు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు తీయగా.. కుల్దీప్, శార్దూల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. షమీ, పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కింది.
All the Indian players appreciate the efforts of Michael Bracewell. pic.twitter.com/QCeMTyQHvu
— SA20 League (@SA___T20) January 18, 2023
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 145 బంతుల్లో ద్విశతకం బాదాడు. ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన అతను వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 208 పరుగులు చేసిన గిల్, ఆఖరి ఓవర్ లో అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (8), ఇషాన్ (5), సూర్య (31), హార్దిక్ పాండ్యా(28) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. భారత్ భారీ స్కోర్ చేసిందంటే అందుకు కారణం గిల్.. సూర్యకుమార్, పాండ్యాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాయపూర్ వేదికగా జనవరి 21న జరగనుంది. ఈ విజయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
That kind of knock Michael Bracewell played tonight!#Cricket #INDvNZ #IndianCricket #TeamIndia #NewZealand pic.twitter.com/80mBsbXyA7
— CRICKETNMORE (@cricketnmore) January 18, 2023