రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న రెండో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. మహమ్మద్ షమీ, సిరాజ్, హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ధాటికి కివీస్ పవర్ ప్లే ముగిసేలోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం శార్దూల్ 11 ఓవర్‌లో లాథమ్ ను ఐదో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో కివీస్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, భారత్ ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో1-0 తేడాతో ఆధిక్యంతో ఉన్న సంగతి తెలిసిందే.
తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు న్యూజిలాండ్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. షమీ తొలి ఓవర్‌లోనే దెబ్బ తీశాడు. ఐదో బంతికి ఫిన్ అలెన్(0)ను బౌల్డ్ చేశాడు. అనంతరం సిరాజ్ ఆరో ఓవర్‌లో హెన్రీ నికోలస్(2)ను పెవిలియన్ పంపాడు. స్లిప్‌లో శుభ్‌మన్ గిల్ క్యాచ్ అందుకోవడంతో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. తరువాత ఏడో ఓవర్‌లో షమీ బౌలింగ్ లో డారెల్ మిచెల్ (1) కాటన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం మరో ఓపెనర్ కాన్వే(7)ను హార్ధిక్ నాలుగో వికెట్‌గా వెనక్కి పంపగా, శార్దూల్ 11 ఓవర్‌లో లాథమ్ ను ఐదో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో కివీస్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిఫ్స్ క్రీజులో ఉన్నారు.
NZ are half down for just 15 !! 😳
Skipper Tom Latham departs for 1 !!#INDvsNZ #NZvsIND pic.twitter.com/HDEPsiOnNC— 🦋 Mee23 🙂 🦋 (@2_Meenu23) January 21, 2023
कैच देखिए कैच #INDvNZ #INDvsNZ #NZvsIND #NZvIND pic.twitter.com/fhDot4c5iP
— OneCricket हिन्दी (@OneCricketHindi) January 21, 2023
#indvsnz #nzvsind NZ 15/5 in 12 overs!
Indian Bowlers on fire 🔥 pic.twitter.com/jMzlLRcqDJ— ASY Current Updates (@AsyCurrentupdte) January 21, 2023