.అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాల్గవ టెస్టులో యువ బ్యాటర్ శుభమాన్ గిల్ సెంచరీతో మెరిశాడు. ఇప్పటికే వన్డే, టీ20 క్రికెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ స్టార్ ఓపెనర్.. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లోనూ సత్తా చాటుతున్నాడు. 193 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ ఆస్ట్రేలియాకు ధీటుగానే బదులిస్తోంది.
శుభమాన్ గిల్.. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లోకి దూసుకొచ్చిన నయా స్టార్ బ్యాటర్. ఇప్పటికే వన్డే, టీ20 క్రికెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ స్టార్ ఓపెనర్.. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లోనూ సత్తా చాటుతున్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాల్గవ టెస్టులో సెంచరీతో మెరిశాడు. 193 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ ఆస్ట్రేలియాకు ధీటుగానే బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ లోనూ రాణిస్తోంది. మూడవరోజు తొలి సెషన్ లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ వికెట్ దక్కించుకోవడంతో భారత్ కు కష్టాలు తప్పవేమో అనిపించింది.
అలాంటి స్థితిలో గిల్ తన క్లాస్ బ్యాటింగ్ తో ఇండియాని ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ, లయ తప్పిన బంతులను తనదైన స్ట్రోక్స్ తో బౌండరీ దాటిస్తూ.. ఆసీస్ కు కొరకరాని కొయ్యగా మారాడు. స్టార్క్, గ్రీన్ తో పాటు, ఆసీస్ స్పిన్ యూనిట్ ఎంత ప్రయత్నించినా గిల్ 191 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేయడం విశేషం. రోహిత్ అవుట్ తర్వాత గిల్ తో జత కట్టిన పుజారా కూడా తన అనుభవాన్ని రంగరించి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే గిల్- పుజారా మధ్య కీలకమైన భాగ్యసామ్యం ఏర్పడింది. అయితే, గిల్ సెంచరీ తరువాత ఎల్బీడబ్ల్యుగా వెనురగడంతో భాగస్వామ్యానికి తెరపడింది. అయితే, ఆసీస్ లాంటి బలమైన జట్టుపై గిల్ సెంచరీ సాధించడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. గిల్ సెంచరీ సాధించే సమయానికి కూడా టీమిండియా సుమారు 290 పరుగులు వెనుకపడి ఉంది. దీంతో.. రానున్న సెషన్స్ కీలకంగా మారాయి. మూడవ రోజు ఆటలో టీమిండియా బ్యాటర్స్ ఇలానే ఆధిపత్యం కొనసాగిస్తే.. భారత్ పటిష్ట స్థితిలోకి వెళ్లడం ఖాయం. మరి.. గిల్ సూపర్ క్లాస్ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The moment Shubman Gill scored his 2nd century!
The generational talent. pic.twitter.com/ckh5zLz2TK
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 11, 2023
The celebration from Shubman Gill and the dugout reaction. pic.twitter.com/bxkVJogwMS
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 11, 2023