‘యూసుఫ్ పఠాన్‘ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడిగా, టీమిండియా మాజీ ఆల్ రౌండర్ గా అందరికీ సుపరిచితమే. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ విధ్వంసకర హిట్టర్, ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసుఫ్ పఠాన్ పెద్దగా రాణించింది లేదు. బ్యాటింగ్ లో మెరుపులు లేకపోగా, బౌలింగ్ లో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటున్నాడు. శుక్రవారం డిజర్ట్ వైపర్స్ తో జరిగిన మ్యాచులో విండీస్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ యూసుఫ్ పఠాన్ బౌలింగ్ ను చీల్చిచెండాడాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సర్లు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
ఈ మ్యాచ్ దెబ్బో.. ఏమో.. యూసఫ్ పఠాన్ తన అసహనాన్ని డ్రెస్సింగ్ రూంలో తోటి ఆటగాళ్లపై చూపించాడు. ‘నీ ఓవర్ వల్లే మ్యాచ్ కోల్పోయాం’ అని తోటి ఆటగాళ్లు నిందించారు అన్నట్లుగా.. బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోతున్నట్లుగా కనపడ్డాడు. సహచర ఆటగాళ్లు, మేనేజిమెంట్ వారిస్తున్నా వినకుండా చాలా సీరియస్ గా బ్యాగ్ భుజాన వేసుకుంటాడు. దీంతో నిర్వాహకులు ఏం చేయాలో తెలియక అతనిని సముదాయించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ.. యూసఫ్ పఠాన్ ఏమాత్రం కూల్ అవ్వకపోగా రెండడుగులు ముందుకేస్తాడు. అనంతరం.. ఇదొక ప్రాంక్ అన్నట్లుగా నవ్వులు చిందిస్తాడు. ఇతగాడు చేసిన చిలిపి పనుల వల్ల దుబాయ్ క్యాపిటల్స్ సిబ్బంది ఒకరు అయోమయానికి లోనవుతాడు. అందుకు సంబంధించిన వీడియోను దుబాయ్ క్యాపిటల్స్, అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.
💓💓💓
Our heartbeats looking at the video 🫣#DPWorldILT20 #ALeagueApart #SoarHighDubai #WeAreCapitals #CapitalsUnplugged | @iamyusufpathan pic.twitter.com/k6dY8GTa0S
— Dubai Capitals (@Dubai_Capitals) February 1, 2023
కాగా, శుక్రవారం జరిగిన దుబాయ్ క్యాపిటల్స్ వర్సెస్ డిజర్ట్ వైపర్స్ మ్యాచులో యూసఫ్ పఠాన్ జట్టు 22 పరుగుల తేడాతో ఓటమి పాలవుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన డిజర్ట్ వైపర్స్ 182 పరుగులు చేయగా, అనంతరం దుబాయ్ క్యాపిటల్స్ 160 పరుగులకే పరిమితమవుతుంది. ముఖ్యంగా యూసఫ్ పఠాన్ వేసిన 16వ ఓవర్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ ఒక్క ఓవర్ లోనే 5 సిక్సులు, ఒక సింగిల్ సాయంతో 31 పరుగులు వస్తాయి. ఈ మ్యాచ్‌లో పఠాన్ నాలుగు ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ‘యూసుఫ్ పఠాన్’ ప్రాంక్ వీడియోపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Five in a row😮
Sherfane Rutherford went after Yusuf Pathan in Desert Vipers’ win over Dubai Capitals #ILT20
(via @ILT20Official) pic.twitter.com/0ZSFsD2AoM
— ESPNcricinfo (@ESPNcricinfo) February 3, 2023