క్రికెట్ లో సిక్స్ కొట్టాలంటే ఒకప్పుడు బ్యాటర్లు చాలా కష్టపడేవాళ్లు. ఇప్పుడు మాత్రం నీళ్లు తాగినంత సులభంగా సిక్సులు కొట్టేస్తున్నారు. టీ20ల ఎఫెక్ట్ ఏమో గానీ కుర్ర ఆటగాళ్లు అయితే రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా పాక్ సూపర్ లీగ్ లోని తాజాగా జరిగిన ఓ మ్యాచులో అరుదైన రికార్డు నమోదైంది. పాక్ యువ క్రికెటర్ ఏకంగా ఓవర్ లో అన్ని బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది క్రికెటర్లు ఈ ఘనత సాధించినప్పటికీ తాజాగా పాక్ క్రికెటర్ సిక్సులు కొట్టడం మాత్రం చాలా స్పెషల్.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్ సూపర్ లీగ్ లో భాగంగా ఆదివారం క్వెట్టా గ్లాడియేటర్స్-పెషావర్ జాల్మీ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. మరోవైపు క్వెట్టా నగరంలోని ఈ స్టేడియంకు దగ్గర్లో బాంబు పేలుడు జరగడం వల్ల మ్యాచ్ ని మధ్యలోనే ఆపేశారు. అయితేనేం అప్పటివరకు జరిగిన మ్యాచ్ లో మాత్రం పాక్ యువ క్రికెటర్ ఇఫ్తికర్ అహ్మద్ బ్యాటుతో రెచ్చిపోయాడు. 50 బంతుల్లో 94 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను అల్లాడించాడు. అయితే క్వెట్టా జట్టు తరఫున ఆడిన మనోడు.. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ప్రతి బంతిని కూడా సిక్సర్ గా మలిచాడు. అవతల ఉన్నది సీనియర్ బౌలర్ వాహబ్ రియాజ్ అయినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా బాదేశాడు. బాంబు పేలుడు, రాళ్లదాడి వల్ల కాసేపు ఆగిపోయిన ఈ మ్యాచును తర్వాత పూర్తి చేశారు. ఇందులో క్వెట్టా గ్లాడియేటర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం.
ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాటర్లలో ఇప్పటివరకు 10 మంది ఉన్నారు. అందులో మన దేశం నుంచి రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన ఆటగాళ్లలో సర్ గ్యారీ సోబర్స్, గిబ్స్, రోజ్ వైట్లీ, హజ్రతుల్లా జజాయ్, లియో కార్టర్, కీరన్ పొలార్డ్, తిశారా పెరీరా, జస్కరన్ మల్హోత్రా ఉన్నారు. వీరందరూ కూడా పలు టోర్నీలు, లీగుల్లో ఈ సిక్సర్ల రికార్డుని తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఇక ఇప్పుడు పాక్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఇఫ్తికర్ అహ్మద్ నిలిచాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిపై మీరే ఓ లుక్కేయండి. ఆ తర్వాత ఈ సిక్సర్లు ఎలా అనిపించాయనేది కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Iftikhar Ahmed smashed 6 sixes in a single over in the PSL exhibition match.pic.twitter.com/s3NRRmrcZl
— Johns. (@CricCrazyJohns) February 5, 2023