గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలుగించిన మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది.. ఇంగ్లాండ్ – పాక్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ అనే చెప్పాలి. పాకిస్థాన్ లోని రావల్పిండి మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 1768 పరుగులు నమోదు అయ్యాయి. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మూడో అత్యధిక స్కోరు. ఇక ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడే.. ఈ పిచ్ పై అనేక విమర్శలు వచ్చాయి. పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రాజా సైతం రావల్పిండి పిచ్ ఇబ్బందికరమైందిగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ పిచ్ కు ఐసీసీ ఇచ్చిన రేటింగ్ ప్రస్తుతం పాక్ బోర్డును ఇరకాటంలో పడేసింది.
ఇంగ్లాండ్ – పాక్ మధ్య రావల్పిండిలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్.. గ్రౌండ్ భవిష్యత్ నే ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ గ్రౌండ్ లో పరుగుల వరద పారిన క్రమంలో అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా ఐసీసీ ఇచ్చిన ‘బిలో యావరేజ్’ రేటింగ్ తో రావల్పిండి మైదానం భవిష్యత్ అంధకారంలో పడబోతోంది. గతంలోనే ఈ గ్రౌండ్ కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. ఇది రెండో సారి కావడంతో పాక్ బోర్డు ఇబ్బందుల్లో పడనుంది. డీమెరిట్ పాయింట్లు ఐదుకి చేరితే.. రావల్పిండి మైదానం క్రికెట్ లో ఒక సంవత్సరం పాటు నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి అని ఐసీసీ తెలిపింది. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం ఇది సరైన పిచ్ కాదు, ఉండాల్సిన సగటు కంటే తక్కువగా ఉంది అని చాలా మంది రిఫరీస్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ పిచ్ గురించి ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ కు సంబంధించిన సభ్యుడు ఆండీ పైక్రాఫ్ట్ ఈ పిచ్ గురించి మాట్లాడుతూ..”రావల్పిండి పిచ్ చాలా ఫ్లాట్ పిచ్. ఎంతటి బౌలర్ కైనా ఈ పిచ్ ఎలాంటి సహాయమూ అందించలేదు. అందుకే బ్యాటర్లు భారీ స్కోర్లు చేస్తుంటారు. మ్యాచ్ ప్రారంభంలో ఈ పిచ్ ఎలా ఉందో చివర్లో కూడా అలాగే ఉంటుంది.. ఏ మాత్రం క్షీణించదు. పైగా ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం ఈ పిచ్ సగటు కంటే తక్కువగానూ ఉంది” అని ఆండీ చెప్పుకొచ్చాడు. ఇక ఈ డీమెరిట్ పాయింట్లు ఇలాగే పెరిగితే అంతర్జాతీయ మ్యాచ్ లకు రావల్పిండి మైదానం దూరం కాక తప్పదు అని పలువురు క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న పాక్ కు ఐసీసీ రావల్పిండి పిచ్ కు ఇచ్చిన డీమెరిట్ రేటింగ్ పాయింట్లు.. ములిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా అయ్యింది.
“Since there was very little in it for the bowlers, I found the pitch to be ‘below average’ as per the ICC guidelines”
Match referee Andy Pycroft has deemed the pitch used for the Rawalpindi Test as “below average” #PAKvENG pic.twitter.com/ihaRcMPOMK
— ESPNcricinfo (@ESPNcricinfo) December 13, 2022
The ICC has given the Rawalpindi pitch for the 1st #PAKvENG Test a ‘below average’ rating and 1 demerit point.
Pindi now has 2 demerit points in 2 Test matches. If a venue receives 5 demerit points in 5 years, it is suspended from hosting international cricket for 12 months. pic.twitter.com/S8XogO5QOl
— Monem Hassan (@MonemHassan_19) December 13, 2022