కోహ్లీ-డివిలియర్స మంచి స్నేహితులు.. ఐపీఎల్‌లో ఆర్సీబీకి కలిసి ఆడిన తర్వాత వీరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అయితే.. తాజాగా కోహ్లీ గురించి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. కోహ్లీ అహంకారి అంటూ..
ఐపీఎల్‌లో కోహ్లీ అంటే ఆర్సీబీ.. ఆర్సీబీ అంటే కోహ్లీ. ఈ బాండింగ్ ఎప్పటి నుంచో ఇలాగో కొనసాగుతోంది. కొన్నేళ్లుగా ఒకటే ఫ్రాంచైజ్‌కు ఆడిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుల్లో కూడా ఉన్నాడు. అలాగే కోహ్లీ పేరిట కూడా చాలా రికార్డులు ఉన్నాయి. కానీ.. ఒక్కటే ఒక లోటు అదే ఐపీఎల్ ట్రోఫీ. దాదాపు ఐపీఎల్ ఆరంభం సీజన్ నుంచి ఆర్సీబీ ట్రోఫీ కోసం పట్టవదల కుండా పోరాడుతోంది. అప్పటి నుంచి కూడా కోహ్లీ ఆర్సీబీలో సభ్యుడిగా ఉన్నాడు. కొంత కాలానికి కెప్టెన్ కూడా అయ్యాడు. కనీసం కోహ్లీ కెప్టెన్సీలోనైనా ఆర్సీబీ కప్పు గెలుస్తుందంటే.. అదీ జరగలేదు. కోహ్లీకి తోడుగా విధ్వంసకర వీరులు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ఉన్నా కూడా ఆర్సీబీ కప్పు కొట్టలేకపోయింది.
సరే కోహ్లీ కెప్టెన్సీ భారం దించుకుంటేనన్నా.. ఆర్సీబీకి అదృష్టం కలిసి వస్తుందేమో అనుకుంటే అదీ జరగలేదు. చేయాల్సిన అన్ని మార్పులు చేసిన ఆర్సీబీ.. చివరికి విసిగిపోయి పెద్దగా మార్పులు లేకుండానే 2023 ఐపీఎల్ సీజన్‌లో బరిలోకి దిగుతోంది ఆర్సీబీ. కనీసం ఈ సారైనా ఆర్సీబీ కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. పైగా జట్టులో కొంత జోష్ నింపేందుకు ఆ జట్టు మాజీ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌ను ఆహ్వానించి.. టీమ్‌లో ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తోంది ఆర్సీబీ యాజమాన్యం. ఈ క్రమంలోనే వారిని ఆర్సీబీ హాల్ ఆఫ్ ప్రేమ్‌తో సత్కరించి.. ఐపీఎల్ 2023 జెర్సీని సైతం ఆవిష్కరింపజేసింది.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కోహ్లీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలిసారి కోహ్లీని కలవడం గురించి, ఆర్సీబీలోకి రావడం గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011లో తొలి సారి కోహ్లీని కలిసినప్పుడు ఇతను బాగా అహంకారంతో ఉన్నాడని, కాస్త నేల మీదకు దిగితే బాగుటుందని అనుకున్నట్లు ఏబీడీ పేర్కొన్నాడు. కానీ.. కోహ్లీతో స్నేహం తర్వాత అతని గురించి పూర్తిగా తెలుసుకున్న డివిలియర్స్ తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు పేర్కొన్నాడు. ఆర్సీబీలో కోహ్లీ-డివిలియర్స్ చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli said : I LOVE DE VILLIERS ❤pic.twitter.com/Wsec1ZMcHC
— Lokesh Saini (@LokeshVirat18K) March 26, 2023
Kohli, Gayle, De Villiers returns to Chinnaswamy today.
A moment to cherish for all fans. pic.twitter.com/N5KmJVScEt
— Johns. (@CricCrazyJohns) March 26, 2023