ప్రస్తుతం జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేపాల్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచులో విండీస్ కెప్టెన్ షై హోప్ ఇండియన్ రన్ మెషీన్ కింగ్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసాడు.
విండీస్ కెప్టెన్ షై హోప్ వన్డేల్లో ఎంత ప్రమాదకారి బ్యాటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కింగ్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ సంచలనం బాబర్ అజామ్ కి ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇస్తున్నాడు. వన్డే క్రికెట్ లో 50 కి పైగా యావరేజ్ కలిగి ఉన్న అతి కొద్ది మందిలో హోప్ కూడా ఒకడు. గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ విండీస్ జట్టుకి ఎన్నో విజయాలనందించాడు. ఒక రకంగా చెప్పాలంటే విండీస్ జట్టులో నిలకడగా ఆడే ఒకే ఒక్క బ్యాటర్ హోప్. ఈ క్రమంలో ఒక ఎన్నో రికార్డులని తన పేరిట లిఖించుకున్న విండీస్ కెప్టెన్.. తాజాగా ఇండియన్ రన్ మెషీన్ కింగ్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసాడు.
ప్రస్తుతం జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేపాల్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 339 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒక దశలో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విండీస్ కెప్టెన్ హోప్, పూరన్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 200 పైగా వీరు నెలకొల్పిన ఈ భాగస్వామ్యం మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. పూరన్ 94 బంతుల్లోనే 115 పరుగులు చేయగా.. హోప్ 134 పరుగులు చేసాడు. ఇక భారీ సెంచరీతో హోప్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసాడు. వేగంగా 15 సెంచరీలు నెలకొల్పి ఈ లిస్టులో కోహ్లీ కన్నా ముందు వరుసలో నిలిచాడు.
వన్డేల్లో వేగంగా 15 సెంచరీలు కొట్టిన మూడో ఆటగాడిగా హోప్ రికార్డుల్లోకి ఎక్కాడు. 105 ఇన్నింగ్స్‌ల్లో విండీస్ కెప్టెన్ ఈ ఫీట్ సాధిస్తే.. కోహ్లీ తొలి 15 సెంచరీలు చేయడానికి 106 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. ఈ లిస్టులో బాబర్ అజాం(83), హషీమ్ ఆమ్లా (86) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ మూడో స్థానంలో ఉండగా తాజాగా హోప్ ఈ రికార్డ్ బ్రేక్ చేసి మూడో స్థానంలో నిలిచాడు. అంతేకాదు వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మరి ఫుల్ ఫామ్ లో ఉన్న హోప్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.