టెస్టు క్రికెట్ ఆడే విధానాన్ని ఇంగ్లండ్ ఆటగాళ్లు పూర్తిగా మార్చివేస్తున్నారు. టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ.. పరుగుల వరద పారిస్తున్నారు. ఇంగ్లండ్ జట్టు అగ్రెసివ్ క్రికెట్‌కు పాపం పాకిస్థాన్ బౌలర్లు బలవుతున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు తమ గడ్డపై అడుగుపెట్టిందని.. సంతోషపడుతున్న పాక్‌కు కన్నీళ్లు తెప్పిస్తోంది ఇంగ్లండ్. ఇప్పటికే తొలి రోజు 506 పరుగులు చేసి 112 ఏళ్ల టెస్టు క్రికెట్ రికార్డును బద్దులు కొట్టిన ఇంగ్లండ్.. రెండో రోజు కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నారు. తొలి రోజు బెన్ స్టోక్స్, సెంచరీ హీరో బ్రూక్ నాటౌట్‌గా నిలిచిన విషయంతో తెలిసిందే. ఒక రెండు రోజు ఆట మొదలైన తొలి ఓవర్‌లోనే బెన్ స్టోక్స్.. అవుటైనా బ్రూక్స్ మాత్రం తగ్గేదేలే అంటూ బ్యాటింగ్ చేశాడు.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భారీ స్కోర్‌ను సెట్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. పాకిస్థాన్‌ను బ్యాటింగ్ దింపాలని స్టోక్స్ సేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు మ్యాచ్ మొదలైన వెంటనే బాదడమే పనిగా పెట్టుకున్నారు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక వైపు వికెట్లు పడుతునా.. ఎటాకింగ్ షాట్స్ ఆడేందుకు వెనుకాడటంలేదు. దీంతో తొలి రోజులానే రెండో రోజు కూడా పరుగులు ప్రభావం కొనసాగుతోంది. అయితే.. ఇన్నింగ్స్ 83వ ఓవర్‌లో బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. టీ20 మ్యాచ్ ఆడుతున్నట్లు.. బౌలర్‌పై విరుచుకుపడ్డాడు. జాహిద్ మహమూద్ వేసిన ఆ ఓవర్‌లో ఏకంగా రెండు సిక్సులు, మూడు ఫోర్లు, ఒక త్రీడీతో మొత్తం 27 పరుగులు పిండుకున్నారు.
టెస్టు క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 27 పరుగులు చిన్న విషయం కాదు. తొలి రోజు ఏకంగా ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి ఒకే ఓవర్‌లో 24 పరుగులు సాధించిన బ్రూక్.. రెండో రోజు ఆ రికార్డును తానే బద్దలు కొట్టాడు. 6,4,4,4,6,3 బాది పాక్ బౌలర్‌కు చుక్కలు చూపించాడు. ఇక 116 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సులతో 153 పరుగులు చేసిన బ్రూక్, నసీమ్ షా బౌలింగ్‌లో షకీల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతానికి ఇంగ్లండ్ 88 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 593 పరుగుల భారీ స్కోర్ చేసింది. 600 పరుగుల మార్క్ దాటగానే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. పాక్ బౌలర్లలో నసీమ్ షా 3, జాహిద్ మహమూద్ 2, రౌఫ్, అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు.
153 off 116 balls 🚀
What a knock from Harry Brook 👏 pic.twitter.com/hz5dCNyYQa
— Sky Sports Cricket (@SkyCricket) December 2, 2022
Naseem and Saud combine again to take another wicket ☝️
Harry Brook’s fine knock comes to an end. #PAKvENG | #UKSePK pic.twitter.com/mFHywF93Z7
— Pakistan Cricket (@TheRealPCB) December 2, 2022