ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ మ్యాచులో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సంచలన క్యాచ్ కి కారణమయ్యాడు. బౌండరీ దగ్గర చేసిన విన్యాసం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని విస్తుగొలుపుతుంది.
క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఒకప్పుడు అరుదుగా చూసేవాళ్ళం. కానీ టీ 20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేశారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు. తాజాగా అలాంటి గ్రేట్ క్యాచ్ ఒకటి నమోదయింది. హ్యారీ బ్రూక్ పట్టిన ఈ క్యాచ్ ప్రస్తుతం క్రికెట్ లో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకెళ్తే..
ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా ది హండ్రెడ్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వెల్ష్ ఫైర్, నార్తెర్న్ సూపర్ జట్లు తలపడిన మ్యాచులో హ్యారీ బ్రూక్ కళ్ళు చెదిరే క్యాటిక్ అందుకొని అందరిని షాక్ కి గురి చేసాడు. ఇన్నింగ్స్ 84వ బంతికి జానీ బెయిర్ స్టో మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న బ్రూక్.. జంప్ చేస్తూ ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. కానీ అంతలోనే తన శరీరాన్ని అదుపుచేసుకోలేక బంతిని గాల్లోకి విసిరేశాడు. మళ్లీ బంతి బౌండరీ అవతలే పడటంతో బౌండరీ లైన్ చివరన ఉండి మరోసారి బంతిని పట్టుకున్నాయి. అయినా మళ్లీ బ్యాలెన్స్ కోల్పోయి.. మరో ఫీల్డర్ వైపు బంతిని విసిరాడు. ఇలా కొన్ని సెకన్లపాటు బ్రూక్ బౌండరీ లైన్ వద్ద చేసిన విన్యాసాలు వావ్ అనిపించాయి.
చివరికి అప్పటికే అక్కడకు చేరుకున్న ఫీల్డర్ సునాయాసంగా బ్రూక్ విసిరిన క్యాచ్ అందుకున్నాడు. థర్డ్ అంపైర్ చాలా సార్లు చెక్ చేసి దీంతో ప్రత్యర్థి బ్యాటర్ జానీ బెయిర్ స్టో(44) పెవిలియన్ చేరాక తప్పలేదు. ప్రస్తుతం ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదటి బ్యాటింగ్ చేసిన నార్తెర్స్ సూపర్ ఛార్జెస్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వెల్ష్ ఫైర్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మొత్తానికి ఫీల్డింగ్ లో అద్భుత క్యాచ్ అందుకున్నా.. బ్రూక్స్ టీంకి పరాజయం తప్పలేదు. మ్యాచ్ సంగతి పక్కన పెడితే బ్రూక్స్ బౌండరీ దగ్గర చేసిన విన్యాసం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
What a catch by Harry Brook! pic.twitter.com/QQUYZEnBOD
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023