యాషెస్ లో బెయిర్ స్టో రనౌట్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. రెండు జట్ల మధ్య వివాదం ఇప్పుడు రెండు దేశాల మీడియా వరకు వెళ్ళింది. అంతేకాదు ఈ రెండు దేశాల ప్రధానులు సైతం ఈ విషయంలో తమ జట్టుని సపోర్ట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
యాషెస్ లో ఐదవ రోజు ఆటలో భాగంగా బెయిర్ స్టో అనూహ్యంగా రనౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిర్ స్టో ఔటైన విధానంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బెయిర్ స్టో ఉండి ఉంటే ఆ మ్యాచులో ఇంగ్లాండ్ సింపుల్ గా విజయం సాధించేది అని అభిమానులు భావించారు. ఇక ఈ విషయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ మేము అలాంటి స్థితిలో ఉంది ఉంటే అప్పీల్ ని వెనక్కి తీసుకునేవాళ్ళం. ఇలా చేసి గెలవడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఆన్ ఫీల్డ్ అంపైర్ ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు చేసాడు. వీటికి తోడు తాజాగా బ్రిటన్ ప్రధాని రుషీ సునాక్ సైతం ఇంగ్లాండ్ కి సపోర్ట్ చేయడంతో ఏ మాటల యుద్ధం ఇరు దేశాల మీడియా వరకు వెళ్ళిపోయింది. ఒకరినొకరు విమర్శిస్తూ ఆర్టికల్స్ రాస్తూ మాట్లా యుద్ధానికి దిగారు.
కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 52వ ఓవర్లో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే ఈ దశలో ఇక ఓవర్ ముగిసిందని భావించిన బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా క్రీజు వదిలి ముందుకు నడుచుకుంటూ వచ్చాడు.దీన్ని గమనించిన వికెట్ కీపర్ క్యారీ, వికెట్లకు త్రో విసిరి రనౌట్ కి అపీల్ చేసాడు. దీంతో బెయిర్ స్టో కి కాసేపు ఏం జరిగిందో అర్ధం కాలేదు. కాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. మొత్తానికి నిర్లక్ష్యంగా క్రీజ్ దాటిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ వైపుగా వెళ్ళాడు. ఇక ప్రస్తుతం ఈ రనౌట్ రెండు దేశాల క్రికెట్ విషయంలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. ఇంతకీ ఈ గొడవ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం.
ఈ గొడవ మొదట ఆస్ట్రేలియా మీడియా స్టార్ట్ చేసింది. “ద వెస్ట్” ఆస్ట్రేలియన్ పత్రిక బెన్ స్టోక్స్ ని క్రైబేబీస్ అన్న కథనంతో ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందులో న్యాపీ వేసుకున్న స్టోక్స్ ఫోటోను వాడడం చర్చనీయాంశమైంది.ఈ స్టోరీకి గ్రాఫిక్ ఫొటోను వాడి స్టోక్స్ పాలు తాగుతున్నట్లు ఫొటోను క్రియేట్ చేశారు. ఇందులో స్టోక్స్ బోర్లాపడి ఉండగా.. ఎడమవైపు బంతి, కుడివైపు యాషెస్ కప్ ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో బెన్ స్టోక్స్ రియాక్షన్ కూడా అంతకు మించి అనేలా ఉంది. “కచ్చితంగా అది నేను మాత్రం కాదు. అంత చిన్న వయసులో కొత్త బంతితో బౌలింగ్ చేయలేదు. అని అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.మొత్తానికి రెండు క్రికెట్ జట్ల సమస్య ఏకంగా ఆ దేశాల ప్రధాని దగ్గరకు వెళ్లడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.