యాషెస్ లో భాగంగా లార్డ్స్ లో టెస్టులో ఆస్ట్రేలియా మరో విజయాన్ని అందుకుంది. ఆసీస్ విజయం ఏకపక్షం అనుకున్నా ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ విజ్రంభన ధాటికి 43 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచులో వికెట్ కీపర్ క్యారీ చేసిన బెయిర్ స్టోని రనౌట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశయంగా మారింది.
ఒక బ్యాటర్ నిర్లక్ష్యం జట్టు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో జానీ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ని చూస్తే అర్ధం అవుతుంది. ఓపెనర్ బెన్ డకెట్ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన బెయిర్ స్టో ఊహించని రీతిలో రనౌత్ కావడం ఇంగ్లాండ్ ఓటమికి కారణమైంది.ఓవర్‌నైట్ స్కోర్ 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టుని స్టోక్స్, బెన్ డక్లెట్ నికడగా ఆడుతూ విజయం మీద ఆశలు రేపారు. అయితే 112 బంతుల్లో 9 ఫోర్లతో 83 పరుగులు చేసిన డక్లెట్.. హజల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.జట్టు స్కోర్ అప్పటికీ 177 పరుగులు. అయితే ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఊహించని రీతిలో రనౌట్ అవ్వడం ఇంగ్లాండ్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బెయిర్ స్టో రనౌట్ వైరల్ గా మారింది.
యాషెస్ లో భాగంగా లార్డ్స్ లో టెస్టులో ఆస్ట్రేలియా మరో విజయాన్ని అందుకుంది. చివరి రోజు ఆసీస్ విజయం ఏకపక్షం అనుకున్నా ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఆసీస్ కి అంత తేలిగ్గా విజయాన్ని ఇవ్వలేదు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ కంగారూల జట్టుకి చెమటలు పట్టించాడు. భారీ సెంచరీతో 214 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సులు సహాయంతో 155 పరుగులు చేసి ఇంగ్లాండ్ ని గెలిపించినత పని చేసాడు. దీంతో ఆసీస్ కి భారీ విజయం ఖాయమన్నా.. చివరికి 43 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచులో వికెట్ కీపర్ క్యారీ చేసిన బెయిర్ స్టోని రనౌట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశయంగా మారింది. కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 52వ ఓవర్‌లో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే ఈ దశలో ఇక ఓవర్ ముగిసిందని భావించిన బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా క్రీజు వదిలి ముందుకు నడుచుకుంటూ వచ్చాడు.
దీన్ని గమనించిన వికెట్ కీపర్ క్యారీ, వికెట్లకు త్రో విసిరి రనౌట్ కి అపీల్ చేసాడు. దీంతో బెయిర్ స్టో కి కాసేపు ఏం జరిగిందో అర్ధం కాలేదు. కాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. మొత్తానికి నిర్లక్ష్యంగా క్రీజ్ దాటిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ వైపుగా వెళ్ళాడు. బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నాకు సంబంధం లేదు అన్నట్లుగా క్రీజ్ ని వీడి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. అసలే కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ కి ఈ రూపంలో వికెట్ దక్కడంతో సంబరాల్లో తేలిపోయారు. ఇంగ్లాండ్ ఫ్యాన్స్ మాత్రం ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పుకొస్తున్నారు. మరి బెయిర్ స్టో చర్య మేకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.