క్రికెట్‌లో బౌలర్లు వికెట్ తీసిన సమయంలో సంబరాలు చేసుకుంటారు. అతనితో పాటు జట్టు మొత్తం ఆనందంతో ఒక్కటవుతుంది. కానీ.. కొన్ని సార్టు బౌలర్లు డిఫరెంట్ స్టైల్లో వేడుకలు చేసుకుంటు ఉంటారు. ముఖ్యంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు వెరైటీగా సెలబ్రెట్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తాజా బిగ్‌బాష్ లీగ్‌లో పాక్ క్రికెటర్ హరిస్ రౌఫ్ వికెట్ తీసిన ఆనందంలో చేసుకున్న ప్రత్యేక సంబరం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
తన బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వగానే.. చేతుల్లో శానిటైజర్ వేసుకుని రాసుకున్నట్లు చేసి.. జేబులోంచి మాస్క్ తీసి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న సమయంలో.. ఎక్కడ చూసినా మాస్క్‌లు పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి.. ఇవే సందేశాలు విపిపిస్తున్నాయి. వాటికి మరింత ప్రచారం అందించాలనే రౌఫ్ ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్-మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ ఈ విధంగా వేడుకలు జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇదీ చదవండి: వరల్డ్ కప్‌లో ధోని, కోహ్లీ, సెహ్వాగ్‌లను అవుట్ చేసిన బౌలర్! రోడ్డు పక్కన ఇలా..