ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ల ఫొటోలని బిగ్ బాస్ లీగ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇలా పర్లేదు గానీ ఆయా ఫొటోలకు వాలంటైన్స్ డే విషెస్ అని పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రేమికుల దినోత్సవం.. సంవత్సరం అంతా ఎలా ఉన్నా సరే ఈరోజు మాత్రం లవర్స్ కి చాలా చాలా స్పెషల్. తమ పార్ట్ నర్ కి హగ్గులు, ముద్దుల దగ్గర నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్స్ చాలానే ఉంటాయి. ఇక వాట్సాప్ స్టేటస్, ఇన్ స్టా స్టోరీస్ లోనూ ఫొటోస్ పోస్ట్ చేసి ‘హ్యాపీ వాలంటైన్’ అని విషెస్ తో మోత మోగిస్తారు. ఇక ప్రేమంటే అమ్మాయి-అబ్బాయి మధ్య ఉండాలని ఏం లేదు కదా? అవును మీరు విన్నది కరెక్టే. సరిగా ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ గా మారింది. ఇది కాస్త క్రికెట్ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు గురించి కాస్తో కూస్తో ఐడియా ఉన్నవాళ్లకు ఆడమ్ జంపా, స్టోయినిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! చాలా ఏళ్ల క్రితం ఓస్టార్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుంటే వీళ్లిద్దరూ స్టాండ్స్ లో కూర్చొని రొమాన్స్ లాంటిది చేస్తూ కనిపించారు. ఆ తర్వాత ఇలాంటిదే ఒకటి రిపీటైంది. దీంతో ఇద్దరూ గేలు అని చాలామంది అనుకున్నారు. అయితే అలాంటిదేం లేదని స్వయంగా పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు చెప్పినప్పటికీ ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఇప్పుడు బిగ్ బాష్ లీగ్ తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ చూస్తూ నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఈ పోస్ట్ విషయానికొస్తే.. స్టోయినిస్ కు బుగ్గపై ఆడమ్ జంపా ముద్దు పెడుతున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఇక వీళ్లిద్దరూ ఆడుతున్న మెల్ బోర్న్ స్టార్స్ టీమ్.. మరో క్రేజీ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ రెండింటి కూడా హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ క్యాప్షన్స్ పెట్టుకొచ్చారు. దీంతో నెటిజన్స్ అందరూ కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రెండు ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ పోస్టులు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.