రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో స్వదేశంలో భారత వరుస విజయాలకు బ్రేక్ పడింది. న్యూజిలాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు టీ20 సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కాన్వె 52, డార్లీ మిచెల్ 59 రన్స్‌తో న్యూజిలాండ్‌కు మంచి స్కోర్ అందించారు. ముఖ్యంగా మిచెల్ చివర్లో విధ్వంసం సృష్టించాడు. అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మూడు సిక్సులు, ఒక ఫోర్, రెండు డబుల్స్‌తో మొత్తంగా 27 పరుగులు పిండుకున్నాడు. 177 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ దారుణంగా విఫలం అయ్యింది.
కేవలం 15 పరుగులకే టాప్ 3 బ్యాటర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి అవుట్ అవ్వడంతో.. భారత పీకల్లోతు కష్టాల్లో పడింది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా నిదానంగా ఆడుతూ.. జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా.. కీలక దశలో వికెట్లు సమర్పించుకోవడంతో ఓటమి తప్పలేదు. చివర్లో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతో ఆశలు రేపినా.. రిక్వైర్డ్ రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసి.. 21 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తేనే.. ఈ సిరీస్ దక్కే అవకాశం ఉంది.
కాగా.. ఈ మ్యాచ్‌లో ఓటమిపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా కుండబద్దలు కొట్టినట్లు స్పందించాడు. తమ ఓటమికి కారణమైన విషయాలు స్పష్టంగా పేర్కొన్నాడు. అదనంగా 20, 25 రన్స్ ఎక్కువగా ఇవ్వడం, పిచ్‌ను సరిగా అంచనా వేయలేకపోవడమే తమ ఓటమిని శాసించిందని పాండ్యా పేర్కొన్నాడు. పిచ్ అన్యూహంగా స్పందించిందని, అందుకు తగ్గట్లు కివీస్ ఆటగాళ్లు ఆడినట్లు తాము ఆడలేకపోయామని అన్నాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టాడని కితాబిచ్చాడు. అతనికి తోడు మరో బౌలర్, బ్యాటర్ రాణించి ఉంటే.. కచ్చితంగా ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు. అనవసరంగా ఒక 20 రన్స్ అదనంగా సమర్పించుకున్న విషయాన్ని ఒప్పుకున్నాడు. అలాగే పిచ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా దెబ్బతిన్నట్లు పేర్కొన్నాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన, పాండ్యా చెప్పిన కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Nicely summed up by Hardik Pandya 😬#TeamIndia #INDvNZ pic.twitter.com/mdppAHRaU0
— Circle of Cricket (@circleofcricket) January 27, 2023