హార్థిక్‌పాండ్యా ఎప్పటి నుంచో ముంబై ఇండియన్స్‌కు స్ట్రాంగ్ ప్లేయర్‌గా ఉన్నాడు. ముంబై జట్టు మొత్తం ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధిస్తే.. నాలుగు సార్లు పాండ్యా పాలుపంచుకున్నాడు. ఇంతటి ఘనమైన రికార్డ్ ఉన్న ఆటగాడ్ని ముంబై జట్టు యాజమాన్యం ఎందుకు రిటైన్ చేసుకోలేదనే ప్రశ్న తలెత్తడం సహజం. జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న పాండ్యాను ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రిటేన్ చేసుకోవాలని తొలుత అనుకున్నప్పటికీ.. పాండ్యా బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా లేకపోవడంతో అతన్ని వద్దనుకున్నట్లు సమాచారం. వెన్ను నొప్పితో బాధపడుతున్న పాండ్యా 2021 ఐపీఎల్ సీజన్‌లో బౌలింగ్ చేయలేదు.
అలాగే ఐపీఎల్ తర్వాత భారత్ ఆడిన మ్యాచ్‌లలో కూడా పాండ్యా బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో పాండ్యాను రిటేన్ చేసుకుంటే స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గానే జట్టులో ఉంచాలి. పాండ్యా వల్ల ఒక ఆల్‌రౌండర్‌ను ముంబై కోల్పోతుంది. దీంతో పాండ్యాను వదులుకునేందుకే సిద్ధపడినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో ఉన్న విభేదాలే అసలు కారణమని మరికొందరి గట్టి వాదన. ఈ వాదనకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. రోహిత్ శర్మ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ అయిన తర్వాత జాతీయ జట్టులో పాండ్యా చోటు గల్లంతైంది. ముంబై జట్టు కూడా అతన్ని రిటైన్ చేసుకోలేదు. వీటికి తోడు రోహిత్ శర్మ, పాండ్యా ఒకరినొకరు సోషల్‌మీడియా అకౌంట్లలో అన్‌ఫాలో చేసుకున్నారు. ఇవన్నీ గమనిస్తున్న క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ, పాండ్యాకు మధ్య విభేదాలు నడుస్తున్నట్లు ఫిక్స్ అయిపోయారు.
కాగా ముంబై తమ కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌లను రిటైన్ చేసుకుంది. నిబంధనలకు అనుగుణంగా ఒక జట్టు కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలి. ఇలా చాలా కాలం నుంచి పాండ్యాను రిటైన్ చేసుకుంటూ వస్తున్న ముంబై ఇండియన్స్ ఈ సారి మాత్రం అతన్ని వదిలించుకుంది. కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ కోరిక మేరకే అతన్ని ముంబై వదిలేసిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. పాండ్యా ముంబై తరుఫున ఇప్పటి వరకు 1476 పరుగులు చేశాడు. 42 వికెట్లు తీశాడు. దాంతో పాటు ముంబై నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. కాగా పాండ్యాను ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.15 కోట్లకు పిక్ చేసుకోవడంతో పాటు జట్టు పగ్గాలు కూడా అప్పగించిన విషయం తెలిసిందే.
Hardik ne badha loka kahe che great,
aapdo captain hajarma ek! ☝️😎#GujaratTitans pic.twitter.com/KqOoaho9tK— Gujarat Titans (@gujarat_titans) March 8, 2022
Mumbai Indians meri jaan 💙#OneFamily #MumbaiIndians #AalaRe #IPLAuction pic.twitter.com/f6azyFgL6p
— Mumbai Indians (@mipaltan) February 14, 2022