టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వేరే ఎవరో కాదులేండి.. తన భార్యనే మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఇది పెళ్లిళ్ల సీజన్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వరసపెట్టి అందరూ పెళ్లి చేసేసుకుంటున్నారు. టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్.. గత నెలలో తమ తమ ప్రేయసిని మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి హార్దిక్ పాండ్య కూడా చేరాడు. అదేంటి.. ఆల్రెడీ హార్దిక్ కు కొడుకు ఉన్నాడు కదా మళ్లీ పెళ్లేంటి? అని డౌట్ రావొచ్చు. అవును అప్పుడెప్పుడో లాక్ డౌన్ లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ ఫొటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన ఇతడు.. జస్ట్ కొన్నేళ్లలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు కానీ ఆ తర్వాత గాయాల కారణంగా ఫామ్ కోల్పోయాడు. గతేడాది ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు కెప్టెన్ అయిన మనోడు.. ఏకంగా తొలి సీజన్ లోనే కప్ కొట్టేశాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్ కూడా అయిపోయాడు. ఇలా కెరీర్ పరంగా హార్దిక్ పాండ్య ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది వాలంటైన్స్ డే సందర్భంగా తన భార్యనే మరోసారి పెళ్లి చేసుకున్నాడు.
ఓ ఈవెంట్ లో మోడల్ నటాషా స్టాంకోవిచ్, క్రికెటర్ హార్దిక్ పాండ్య పరిచమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. 2019 డిసెంబరు 31న దుబాయిలో నటాషా చేతికి రింగ్ తొడిగి హార్దిక్ పాండ్య ప్రపోజ్ చేశాడు. అప్పుడే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక 2020 లాక్ డౌన్ లో తన భార్య ప్రెగ్నెంట్ అని హార్దిక్ అనౌన్స్ చేయడంతో హార్దిక్-నటాషా పెళ్లి చేసుకున్నారని అందరికీ తెలిసింది. అదే ఏడాది జులైలో వీళ్లకు అగస్త్య పుట్టాడు. అయితే గ్రాండ్ గా పెళ్లి మిస్ అయ్యానని అనిపించిందో ఏమో గానీ.. ఓ ఐలాండ్ లో వేడుకగా హార్దిక్-నటాషా పెళ్లి జరిగింది. ఆ ఫొటోలని స్వయంగా అతడే తన ఇన్ స్టా షేర్ చేయడం విశేషం. ఈ పెళ్లిలో హార్దిక్ కొడుకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. మరి ఈ ఫొటోలు చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.