క్రికెటర్లకు సంబంధించి ప్రస్తుతం పెళ్లి సీజన్ నడుస్తున్నట్లే ఉంది. ఇంటర్నేషనల్ క్రికెటర్లు వరుసగా పెళ్లి బాట పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో స్టార్ క్రికెటర్ చేరనున్నాడని తెలుస్తోంది.
అంతర్జాతీయ క్రికెటర్లు వరుసగా పెళ్లి బాట పడుతున్నారు. వన్డే వరల్డ్‌కప్‌కు సమయం దగ్గరపడుతుండటం, టైట్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉండటం లాంటి కారణాల వల్ల క్రికెటర్లు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల భారత ప్లేయర్లు అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్.. అలాగే పాకిస్థాన్ క్రికెటర్లు షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్‌లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా పాక్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఒకరకంగా క్రికెటర్లకు సంబంధించి పెళ్లి సీజన్ నడుస్తోందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మరో క్రికెటర్ మ్యారేజ్ చేసుకోనున్నాడు. అతడే టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. అవును, ఇది నిజం. ఇప్పటికే పెళ్లయిన హార్దిక్-నటాషా స్టాంకోవిక్ దంపతులు మరోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలుస్తోంది.
మూడేళ్ల కిందే హార్దిక్-నటాషాలు పెళ్లాడారు. 2020 మే 31న కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితుల మధ్య వీళ్లిద్దరి వివాహం నిరాడంబరంగా జరిగింది. పెళ్లి సమయానికే నటాషా గర్భవతి కావడం గమనార్హం. అదే ఏడాది జూలైలో వీళ్లిద్దరికీ కొడుకు పుట్టాడు. అయితే అప్పట్లో పెళ్లి కాస్త హడావుడిగా జరిగిందనే ఆలోచనలో ఉన్న హార్దిక్ దంపతులు పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ గ్రాండ్‌గా మ్యారేజ్ చేసుకుందామని భావించారట. అయితే కుదరలేదట. మొత్తానికి పెళ్లయిన మూడేళ్లకు మళ్లీ సంప్రదాయ పద్ధతితో గ్రాండ్‌గా వివాహం చేసుకోవాలని వీళ్లు ప్లాన్ చేస్తున్నారట. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హార్దిక్-స్టాంకోవిక్‌లు పెళ్లాడనున్నారని సమాచారం. ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు ఈ వేడుకలు జరగనున్నాయట. పెళ్లిలో భాగంగా జరిపే హల్దీ, మెహిందీ, సంగీత్ లాంటి వాటిని భారీగా ప్లాన్ చేశారట. గతేడాది నవంబర్ నుంచే ఈ సెర్మనీకి సంబంధించిన ఏర్పాట్లను మొదలుపెట్టారని సమాచారం. మరి, హార్దిక్-నటాషాలు మరోసారి పెళ్లాడనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#EXCLUSIVE: Cricketer @hardikpandya7 and @NatasaStankovic to have a white wedding on Valentine’s Day in Udaipur
Read👉https://t.co/KexG9Pyeso
🖋️@VinayMishra12#HardikPandya #NatasaStankovic #ValentinesDay #Wedding #ValentinesDay2023 #VDay2023 #WeddingDay #HTCityExclusive pic.twitter.com/LenYvSwUgi— HT City (@htcity) February 12, 2023