రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి వేసిన నాటునాటు పాట ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. కీరవాణీ-చంద్రబోస్ జోడీ ఆ పాటకు ఆస్కార్ సైతం అందుకుంది. ఇప్పుడు భజ్జీ-రైనా ఆ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు.
రెండు రోజుల క్రితం దేశం మొత్తాన్ని ఒక వార్త సంతోషంతో ఊడిపోయేలా చేసింది. సినీ ప్రేమికులైతే సంబురాలు చేసుకున్నారు. ఆ సంతోషానికి, సంబురానికి కారణం ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రావడం. ఇంకా.. ‘నాటు నాటు’ ఫీవర్ తగ్గలేదు. అందుకు చక్కటి ఉదాహరణే ఈ వీడియో. భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనాలు తాజాగా నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. వీరి స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో భజ్జీ, రైనా ఇద్దరూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటారు. పైగా ఇండియాకు వరల్డ్ కప్ అందించిన జట్టు సభ్యులు.. ఈ నేపథ్యంతో లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో కలిసి ఆడుతున్న ఈ ఇద్దరూ.. సరదాగా నాటు నాటుకు అదిరిపోయే స్టెపులు వేశారు.
రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో చంద్రబోస్ సాహిత్యంలో, ఎంఎం కీరవాణీ సంగీతంలో వచ్చిన ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. అది కూడా జనరల్ క్యాటగిరీలో రావడం విశేషం. ఈ పాటకు ఇప్పుడు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం కాళ్లు కదపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్-ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు సినిమా ప్రేక్షకులు ఊగిపోతే.. ఇప్పుడు భజ్జీ-రైనా వేసిన స్టెప్పులకు క్రికెట్ అభిమానులు సైతం ఊగిపోతున్నారు. మరి వీడియో చూసి.. భజ్జీ-రైనా నాటు నాటు డ్యాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి
‘Naatu Naatu’ from Suresh Raina and Harbhajan Singh. pic.twitter.com/s6kN0bdVIx
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 15, 2023