ఈసారి ఆస్కార్ వేడుకల్లో భారతదేశం సత్తా చాటింది. ఏకంగా రెండు పురస్కారాలతో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఆస్కార్ సాధించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిర్మాత మాత్రం అవార్డు కమిటీ మీద సంచలన ఆరోపణలు చేశారు.
పూనకాలు తెప్పించే ఒక పాట వస్తుంటే మనుషులు డ్యాన్స్ వేయకుండా ఉండలేరు. అయితే వస్తువులతో కూడా డ్యాన్స్ చేయించే వారు ఉంటారు. అంటే బీట్ కి తగ్గట్టు వస్తువుల మూమెంట్స్ ని సింక్ చేస్తారు. తాజాగా వందకు పైగా కార్లు నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి వేసిన నాటునాటు పాట ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. కీరవాణీ-చంద్రబోస్ జోడీ ఆ పాటకు ఆస్కార్ సైతం అందుకుంది. ఇప్పుడు భజ్జీ-రైనా ఆ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు.