టీ20 ప్రపంచ కప్ మాదేనంటూ అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఆస్ట్రేలియా గడ్డపై అడగుపెట్టిన రోహిత్ సేన ఎంతటి పరాభవాన్ని మూటగట్టుకుందో అందరికీ గుర్తుండే ఉంటుంది. పడుతూ.. లేస్తూ.. సెమీస్ కు చేరిన టీమిండియా.. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో 10 వికెట్ల తేడాతో అవమానకర రీతిలో ఓటమిపాలైంది. దీంతో అప్పటి నుంచి భారత జట్టు ఆటతీరుపై, కెప్టెన్సీపై, కోచ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు. పొట్టి ఫార్మాట్‌లో కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పనికిరాడని, అతను టెస్టు స్పెషలిస్ట్ అని గుర్తుచేశాడు.
హర్భజన్ ప్రస్తుతం అబుదాబి టీ20 లీగ్ లో ఢిల్లీ బుల్స్ తరుపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో పీటీఐతో మాట్లాడుతూ.. టీ20 ఫార్మాట్ కు కోచ్ గా.. క్రికెట్ నుంచి రీసెంట్ గా రిటైరైన క్రికెటర్లను నియమించుకోవాలి అని తెలిపాడు. “రాహుల్ ద్రావిడ్ వద్ద అసామాన్యమైన క్రికెట్ పరిజ్ఞానం ఉంది. దాన్ని తప్పుబట్టను. కానీ టీ20 ఫార్మాట్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ ఫార్మాట్ ఆడిన వాళ్లు అయితే కోచ్‌గా బాగుంటుంది. ఈ విషయంలో రాహుల్ కన్నా నెహ్రాకు చాలా ఎక్కువ తెలుసు. కాబట్టి పొట్టి ఫార్మాట్‌లో అతన్ని కోచ్‌గా నియమిస్తే బాగుంటుంది. అలాగని రాహుల్‌ను తీసేయండి అని చెప్పడం లేదు. ఈ ఫార్మాట్‌లో ఇద్దరూ కలిసి కోచింగ్ ఇచ్చినా జట్టుకు మంచే జరుగుతుంది..” అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
Harbhajan Singh feels someone like Ashish Nehra must be part of India’s T20 coaching setup as he knows the format perhaps better than current head coach Rahul Dravid.
Do you agree with Harbhajan’s suggestion? 🤔#RahulDravid | #AshishNehra | #HarbhajanSingh pic.twitter.com/JXnBsjZ3cW
— Cricket.com (@weRcricket) November 24, 2022
ఇక టీ20 క్రికెట్ లో అటాకింగ్ అప్రోచ్ గురించి స్పందిస్తూ.. “అది మంచి ఆలోచనే. దాని వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. టీ20 ఫార్మాట్ అనేది వన్డే, టెస్టులకు పూర్తి భిన్నమైనది. సంప్రదాయ వన్డే క్రికెట్ మాదిరిగా ఆడతామంటే టీ20లలో కుదరదు. ఈ ఫార్మాట్ లో తొలి ఆరు ఓవర్లు చాలా కీలకం. మొదట వచ్చే ముగ్గురు బ్యాటర్లు దూకుడుగా ఆడితే చివరి ఓవర్లలో వచ్చేవారిమీద ఒత్తిడి తగ్గుతుంది. ఈ విషయంలో రోహిత్, రాహుల్, కోహ్లీలు వాళ్ల స్ట్రైక్ రేట్ మెరుగుపరుచుకోవాలి..” అని హర్భజన్ తెలిపాడు. కాగా, 2024 టీ20 వరల్డ్ కప్ కు కొత్త కెప్టెన్ వేటలో బీసీసీఐ ఇప్పటికే తలమునకలై ఉంది.
2022 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా పని చేసిన ఆశిష్ నెహ్రా.. ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుండేవాడు. అందరి కోచుల్లాగా కంప్యూటర్లలో నోట్ చేయకుండా.. పెన్నుతో పేపర్ పై రాసేవాడు. ఆ కష్టం ఫలితంగానే గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో ఫైనల్ చేరింది. చివరకు రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ట్రోఫీ ముద్దాడింది. ఈ క్రమంలోనే అతన్ని జట్టు కోసం ఉపయోగించుకోవాలని హర్భజన్ సలహా ఇస్తున్నాడు.
No Laptops, No Fancy Data Interpretations.
Just used Pen & Paper and Gujarat Titans win the IPL 2022.
Congratulations Ashish Nehra the coach!!#IPLFinal #IPL2022 pic.twitter.com/gU0JXEMPbR— Abhimanyu (@abhimanyusrt) May 29, 2022
IPL Winning Coaches
2022 – GT (Ashish Nehra)*
2021 – CSK (Stephen Fleming)
2020 – MI (Jayawardene)
2019 – MI (Jayawardene)
2018 – CSK (Stephen Fleming)
2017 – MI (Jayawardene)
2016 – SRH (Tom Moody)
2015 – MI (Ricky Ponting)
2014 – KKR (Trevor Bayliss)(1/2) pic.twitter.com/VDUm7IMbJb
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 30, 2022