CSK ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్.. అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి జోష్ అందించే వార్త అనే చెప్పాలి. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే CSK జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న సీనియర్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ వీసా కారణంగా మొదటి మ్యాచ్ లో ఆడకపోవచ్చనే వార్తలు వినిపించాయి.
ఇది కూడా చదవండి: ఋతురాజ్ గైక్వాడ్ కు అంత సీన్ లేదు: సురేష్ రైనా!
టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లో భాగంగా వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఇక తాజా సమాచారం మొయిన్ అలీ గురువారం భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నట్లు సీఈవో కాశీ విశ్వనాథ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో CSK జట్టుతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ మొయిన్ అలీ మూడు రోజుల ఐసోలేషన్‌లో ఉండనుండంతో శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే ఫస్ట్ మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.