ఇండియాలో మళ్లీ ఐపీఎల్ సందడి చేయనుంది. ప్రతీ ఏటా ఐపీఎల్ కి క్రేజ్ బాగా పెరుగుతోంది. గత వారమే ఐపీఎల్ వేలం ముగియడంతో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 15 నిర్వహణకు బీసీసీఐ రంగం సిద్దం చేసింది. ఈ సమయంలో క్రికెట్ ఫ్యాన్స్ కి ఐపీఎల్ కి సంబంధించిన ఓ గుడ్ న్యూస్. ఐపీఎల్ 2022 ను మార్చ్ 27 ప్రారంభం అవుతుందని సమాచారం. ఫైనల్స్ మే 28 నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తుందని టాక్. ఇక ఐపీఎల్ నిర్వహణ కోసం ఆరు స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం.ఈసారి జరగనున్న ఐపీఎల్ 15వ సీజన్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది. గత సీజన్లతో పోలిస్తే.. ఈ సారి ఐపీఎల్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ సారి ఐపీఎల్లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఈ సీజన్ లో మొత్తం మీద 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
గత ఐపీఎల్ ను కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహించింది బీసీసీఐ. అయితే 2021లో ఇండియాలోనే ప్రారంభించినప్పటికీ కొంత మంది ప్లేయర్స్ కరోనా బారిన పడటంతో.. మిగిలిన మ్యాచ్ లను యూఏఈ వేదికగా నిర్వహించి.. ఐపీఎల్ 2021 పూర్తి చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కట్టుదిట్టమైన నిబంధనల నడుమ భారత్ లోనే ఐపీఎల్- 2022 నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. భారత్ లోనే ఐపీఎల్ 2022 ఉంటుందని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. ఇతర విషయాలపై మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆ సారి ఐపీఎల్ మార్చి 27 నుంచి 28 వరకు జరిగే అవకాశాలున్నాయి వార్తలు వినిపిస్తోన్నాయి.మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.