మోస్ట్ లవబుల్ క్రికెట్ కపుల్స్ రోహిత్ శర్మ-రితికా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఇద్దరు ఎంతో అనోన్యంగా ఉంటారు. ప్రస్తుతం రోహిత్ శర్మ గాయంగా కారణంగా ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటూ.. ఫిట్‌నెల్ సాధించే పనిలో ఉన్నాడు. అలాగే రితికా ప్రస్తుతం రోహిత్ వర్మను బాగా మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. దానికి కారణంగా గురువారం రితికా టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఆర్డ్‌ర్‌లాంటి రిక్వెస్ట్ చేసింది. తన తరపున రోహిత్ శర్మకు ఒక హగ్ ఇవ్వమని చెప్పింది. కాగా సూర్యకుమార్ గురువారం నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు.. ఈ నేపథ్యంలోనే తన సహచరుడు, ముంబై ఇండియన్స్ సారథి అయిన రోహిత్‌తో అక్కడ సరదాగా గడిపాడు.
అతనితో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దానికి ‘హే బ్రో’అని రో పేరు వచ్చేలా క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ పోస్ట్‌ను చూసిన రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్ధే.. తనదైన శైలిలో బదులిచ్చింది. ‘సూర్య.. నా తరఫున రోహిత్‌కు ఓ హగ్ ఇవ్వు’అని కామెంట్ చేసింది. ఇది చూసిన సూర్య.. నా కర్మ అనే ఏమోజీతో ఇచ్చినా’ అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల మధ్య ఉన్న బాండింగ్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రితికా రిక్వెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ- రోహిత్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం! ట్వీట్స్ వైరల్!
Hey b-Ro💙🤗 pic.twitter.com/i5p6WTn0mO
— Surya Kumar Yadav (@surya_14kumar) January 6, 2022