ఆసిస్ తో జరిగిన మూడో టెస్ట్ లో భారత బ్యాటర్లు విఫలం కావడంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటర్లు ఓ విషయంలో తప్పుచేశారని చెప్పుకొచ్చాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
గతకొంత కాలంగా టీమిండియా వరుస విజయాలతో సిరీస్ లు కైవసం చేసుకుంటూ.. క్రీడాలోకంలో దూసుకెళ్తోంది. ఇక తాజాగా ఆసిస్ తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సైతం తొలి రెండు టెస్ట్ ల్లో సత్తా చాటింది. అయితే అనూహ్యంగా మూడో టెస్ట్ లో తడబడిన భారత్.. ఆసిస్ చేతిలో 9 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. దాంతో టీమిండియాపై ఇంటా, బయట తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టుపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్, భాజాపా ఎంపీ గౌతమ్ గంభీర్.
ఆసిస్ తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలం కావడంతో ఆసిస్ 9 వికెట్లతో విజయం సాధించింది. దాంతో భారత బ్యాటర్ల బ్యాటింగ్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా ఓటమికి కారణాలను వెల్లడించాడు భారత మాజీ ఓపెనర్, భాజాపా ఎంపీ గౌతమ్ గంభీర్. ఓ క్రీడా ఛానల్ తో గంభీర్ మాట్లాడుతూ..”టీమిండియా విషయంలో బీసీసీఐ చేసిన ప్రధాన తప్పు ఒక్కటే. అదేంటంటే? బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ప్రారంభానికి ముందే.. టీమిండియా ఆటగాళ్లను రంజీ ట్రోఫీలో ఆడించాల్సింది. దాంతో స్పిన్ పిచ్ లపై ఎలా ఆడాలో ఇంకా బాగా భారత బ్యాటర్లకు తెలిసేది. అయితే ఆ పని చేయలేదు. ఇక రంజీ ట్రోఫీలో కనీసం 20 రోజుల క్యాంప్ అయిన పెట్టి, నెట్స్ లో ప్రాక్టీస్ చేయించి ఉండాల్సింది” అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
అయితే గంభీర్ తాజాగా చేసిన ఈ సూచనలే ఈ సిరీస్ కు ముందు భారత మాజీలు లేవనెత్తారు. కానీ వాటిని బీసీసీఐ సిరీయస్ గా తీసుకోలేదు. దాంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకునే స్థితికి చేరుకుంది. చివరిదైన నాలుగో టెస్ట్ గెలవక పోతే టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు అర్హత సాధించడం కష్టం అవుతుంది. స్పిన్ పిచ్ లపై సత్తా చాటే భారత బ్యాటర్లు.. ఆసిస్ స్పిన్నర్లకు దాసోహం అవ్వడం వెనక కారణాలు అంతుపట్టడం లేదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మరి టీమిండియా బ్యాటర్లను రంజీల్లో ఆడించాల్సింది అన్న గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gautam Gambhir believes that Indian batters should have considered playing a few Ranji Trophy matches to gear up for the crucial BGT series against Australia.#GautamGambhir #INDvsAUS #BGT2023 pic.twitter.com/F2sn0uvPTg
— CricTracker (@Cricketracker) March 8, 2023