సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానాల్లో కొన్ని కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని గొడవలకు సంబంధించినవి అయితే.. కొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ టీ20 లీగ్ లో నవ్వులు పూయించే సన్నివేశం చోటుచేసుకుంది. ILT20 లీగ్ లో భాగంగా తాజాగా MI ఎమిరైట్స్ వర్సెస్ అబుదాబీ నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎమిరైట్స్ 5 వికెట్ల తేడాతో చివరి ఓవర్ లో గెలిచింది. అయితే ఎమిరైట్స్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ ఓ విచిత్రమైన నో బాల్ వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం ఈ నోబాల్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
యూఏఈ వేదికగా ILT20 లీగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ లీగ్ లో భాగంగా ముంబై ఎమిరైట్స్ వర్సెస్ అబుదాబీ నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అయిన ఫజల్ హక్ ఫారూఖీ ఎమిరైట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే బౌలింగ్ కు దిగిన ఫారూఖీ.. విచిత్రమైన నో బాల్ వేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. బాల్ ను సరాసరి బ్యాటర్ పై నుంచి కీపర్ అవతల విసిరేశాడు. అది కాస్త బౌండరీకి తరలింది. ఇంకాస్త గట్టిగా విసిరితే ఏకంగా సిక్స్ పడేదే బాల్. ఈ విచిత్రమైన నో బాల్ ను చూసిన బ్రావో స్లిప్ లో ఉండి నవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. మరి గల్లీ క్రికెట్ లో తలపించిన ఈ నో బాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Kabhi Kabhi Aisa Bhee Hota Hai
😐😐pic.twitter.com/Ac4jjGKIIj— International League T20 (@ILT20Official) January 21, 2023